సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించిన తరుణంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హత్యకు గురైయ్యాడు. హత్యకు ముందు అతడ్ని కొన్ని గంటలపాటు భౌతికంగా హింసించారని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి తెలిపారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌ దేశ రాజధాని ఐనా ఢాకాలోని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం సుమారు రాత్రి 8 గంటల సమయంలో అబ్రార్ ఫహద్‌ను అతని గది నుంచి బయటకు తీసుకెళ్లి, దాదాపు నాలుగు గంటల పాటు కొట్టారని తోటి  విద్యార్థులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు, శరీరంపై తీవ్రంగా కొట్టిన గుర్తులు కూడా ఉన్నాయి అని తెలిపారు.


21 ఏళ్ల ఫహద్ ఢాకాలోని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్‌ విద్యార్థి. ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చెరుపుతున్నారు. వారంతా  కూడా పాలక పార్టీ అవామీ లీగ్‌కు చెందిన యువజన విభాగం బంగ్లాదేశ్ ఛత్రా లీగ్ (బీసీఎల్)‌లో సభ్యులు కావడం గమనార్థకం. విద్యార్థులను హింసిస్తూ, వారిని దోపిడీ చేస్తున్నట్లు బీసీఎల్‌పై తీవ్రస్థాయిలో  పలు విమర్శలు కూడా వస్తున్నాయి.


వసతిగృహంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా పరిశీలించగా, కొందరు వ్యక్తులు ఫహద్‌ను మోసుకెళుతున్నట్లు కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు బీసీఎల్‌ కార్యకర్తలతో సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వారంతా కూడా యూనివర్సిటీకి చెందినవారేనని తెలియచేశారు. ఫహద్‌ను కొట్టి చంపారని ఢాకా డిప్యూటీ పోలీస్ కమిషనర్ మున్తాసిరుల్ ఇస్లాం తెలియచేశారు.


'దయచేసి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి' అని రాత్రి రెండు గంటల వరకు ఫహద్ బతికే ఉన్నాడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని యూనివర్సిటీ విద్యార్థి ఒకరు బీబీసీకి చెప్పారు. నేను రాత్రి రెండు గంటలకు  ఫహద్ ని చూసినప్పుడు అబ్రార్ తన గదిలో కొనప్రాణంతో ఉన్నాడు. జూనియర్ల సహకారంతో అతడ్ని గది నుంచి బయటకు tekoniraga . అప్పుడు తనను త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ప్రాధేయపడ్డాడు'' అని ఆ విద్యార్థి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: