కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు గాని,భవనాలు గాని వర్షాలు వస్తే ఆగడం లేదు. నగరంలో రోడ్లైతే ఎంత అధ్వానంగా మారాయే నిత్యం ప్రయాణించే వాళ్లను అడిగితే ఆ బాధను కళ్లకు కట్టినట్లు చెబుతారు. ఇక కొత్త కొత్త బిల్డింగ్స్ సంగతి చెప్పక్కర్లేదు .లోపలంతా నిమ్ముపట్టి పెచ్చులు పెచ్చులు ఊడిపిపోవడం. స్లాబులు విరిగి మీద పడి మరణించడం, లేదా గాయాల పాలవ్వడం జరుగుతుంది. ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు  దిగువ,ఎగువ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికి కారణం వరద కాలువలు పునరుద్ధరించకపోవడం. వరద నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేయకపోవడం.


ఇవేగాక  నగర ప్రజలకు ఉన్న ముప్పులు ఇన్ని రకాలని చెప్పడానికి వీలు లేనంతగా ప్రజల జీవనం తయారైంది. ఈ దశలో పురాతణ కట్టడాలు, గోడలు బీటలు వాసిన నిర్మాణాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి నివాస స్దలాలు అందులో వున్నవారికే కాకుండా చుట్టుప్రక్కల వున్న వారిపాలిట కూడా చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇకపోతే గ్రేటర్‌ పరిధిలోని ప్రాంతాల్లో వరద ఇబ్బందుల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోన్నా.. మహానగరాన్ని ఆనుకొని ఉన్న విస్తరిత అభివృద్ధి జరుగుతోన్న ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కొత్త కాలనీల్లో నీరు నిలిచినా... మట్టి రోడ్లపై గుంతలు పడినా.. వదర ముంచెత్తినా పట్టించుకునే వారు ఉండరు.


పంచాయతీల పరిధిలో వరద నీటి నిర్వహణకు అవసరమైన యంత్రాంగం లేకపోవడం... ముందస్తు ఏర్పాట్లు చేసే పరిస్థితి లేని నేపథ్యంలో శివారు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ జల ప్రళయం నేపథ్యంలో శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముంపు ముంచుకొస్తే ఏంటీ పరిస్థితి....? అని అల్లాడుతున్నారు. ఈ పరిస్దితుల్లో పాతభవనాలు చాలా ప్రమాదకరంగా మారుతున్న పట్టించునే నాధులే లేరు. ఇక ఇప్పటికే అధికారులు నగర వ్యాప్తంగా సర్వే చేయించి 800 కుపైగా పాత నిర్మాణాలున్నాయని లెక్క తేల్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: