హైదరాబాద్ మహానగరం.. ఈ మహానగరాన్ని గజగజ వణికిస్తోంది వర్షం. గత వారం రోజుల నుంచి సమయంకాని సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. అనవసరంగా ఉరుములు ఉరుముతున్నాయి. పిడుగులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ పెంట్ హౌస్ పై పిడుగు పడింది. నిన్నటికి నిన్న నాలుగు దున్నపోతులపై పిడుగు పడింది. 


ఇంకా హైదరాబాద్ మహానగరం దగ్గరకు వస్తే.. ఈ వర్షం కురిసేది కాసేపు అయినా ట్రాఫిక్ జామ్ అయ్యేది మాత్రం గంటలు గంటలు. చిన్న వర్షానికి కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. చిన్న వర్షమే అయినా హైదరాబాద్ లో ఉండే రోడ్ల కారణంగా ఎక్కడి నీళ్లు అక్కడ నిలిచిపోతాయి. అలా ఆ నీరు నిలిచిపోవడం వల్ల దోమలు వస్తాయి. ఆ వచ్చిన దోమలు ఇళ్లలోకి దూరి కుట్టి కుట్టి పెడుతాయి. 


ఎన్ని అల్ అవుట్లు, ఎన్ని గుడ్ నైట్లు పెట్టిన ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఈ హైదరాబాద్ లో కురిసేది చిన్న చిన్న వర్షాలు అయినా పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. ఆ దోమలు కుట్టడం వల్ల వైరల్ ఫివర్లు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు కట్టగట్టుకొని వస్తాయి. ఇంకేముంది పెద్దలు ఆఫీసులకు పోవడం, చిన్న పిల్లలు స్కూల్ కి పోవడాలు అపి హైదరాబాద్ ఆసుపత్రిల చుట్టూ ట్రాఫిక్ లో కష్టపడుతూ తిరగాలి. 


ఇది హైదరాబాద్ కాదు.. హైదరాబాదుడే. పడేది చిన్న వర్షం. కానీ హైదరాబాద్ లో ఉండేది పెద్ద పెద్ద గుంతలు. వర్షానికి మూడ్ వచ్చి వరుసగా 3 గంటలు వర్షం పడింది అనే మహానగరం మునిపోతుంది. మాకు వర్షాలు లేవు దేవుడా ఇక్కడ పడు అంటే పడకుండా హైదరాబాద్ లో పడి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి ఈ వర్షాల నుంచి ప్రజలకు విముక్తి ఎప్పుడు వస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: