గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దారుణంగా కురుస్తున్నాయి.  ఈ వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.  ఎటు చూసినా మోకాళ్ళలోతున నీరు ప్రవహిస్తోంది.  ఎక్కడ మ్యాన్ హొల్స్ ఉంటాయో తెలియక.. ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  హైదరాబాద్ సిటీలో గత కొన్ని రోజులుగా ఏ సమయంలో వర్షం కురుస్తుందో ఎప్పుడు పొడి వాతావరణం ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  


నిత్యం హైదరాబాద్ సిటీలో వాతావరణం క్షణక్షణానికి మారరిపోతున్నది.  ఉన్నట్టుండి మాములు పడుతున్నాయి.  అంతలోనే ఎండ వస్తున్నది. ఇలా కొన్ని రోజులుగా వర్షాలు కురవడం వలన రాష్ట్రంలో ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.  నీరు నిల్వఉండటంతో ... దోమలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి.  దోమకాటు వలన తెలియని రోగాలు వస్తున్నాయి.  ఇలా రోగాల కారణంగా హాస్పిటల్స్ లో జనాలు చేరిపోతున్నారు.  


సిటీలో నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉన్నది.  ఇలా వర్షం కురవడం వలన కలిగే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.  ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితి.  ఇంకా రెండు మూడు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేస్తోంది.  వాతారణంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి.  


బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తుండటం విశేషం.  గతంలో కంటే ఈసారి వర్షాలు మరింత ఎక్కువగా కురిశాయి.  కావాల్సినంత నీరు ఉన్నది.  అయితే, నీటిని స్టోర్ చేసుకోవడానికి సరైన వసతులు కనిపించడం లేదు.  గతంలో ప్రతి చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలనీ, వర్షం నీటిని నిలువ చేయాలని గతంలో ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే.  కానీ, వాటిని ఎంతమంది అమలు చేస్తున్నారో అందరి తెలిసిందే.  ప్రతి ఒక్కరు పూనుకుంటేనే పనులు ముందుకు సాగుతాయి.  ఇలా వర్షాకాలం వచ్చినపుడు హడావుడి చేస్తూ.. మిగతా సమయాల్లో మర్చిపోతే.. ఇలానే ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: