హైదరాబాద్ మహానగరం.. ఈ మహానగరాన్ని గజగజ వణికిస్తోంది వర్షం. గత వారం రోజుల నుంచి సమయంకాని సమయంలో వర్షాలు కురిసి ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. కరెక్ట్ గా ఆఫీస్ పొయ్యే సమయానికి, ఆఫీస్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఏదో మొక్కుబడి అన్నట్టు వర్షాలు కురుస్తున్నాయి. మా గ్రామాలలో వర్షాలు లేవు మొర్రో అని రైతులు మోర పెట్టుకున్న వినకుండా హైదరాబాద్ పై కక్ష సాధిస్తుంది ఈ వర్షం. 


ఎన్నడూ ఇంత జోరు వర్షం పడలేదు. గత వారం రోజుల నుంచి ఆగి ఆగి పడుతూనే ఉంది. దీంతో హుస్సేన్ సాగర్ కి కోపం వస్తుంది. వర్షం ఇంకా ఇలా వచ్చావు అంటే హైదరాబాద్ ప్రజలకు చుక్కలు చూపిస్త అంటుంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు కురిసిన వర్షాలకే ఈ హుస్సేన్ సాగర్ పొంగి పొర్లుతుంది. ఇంకా వర్షాలు ఇలాగె కురిసాయి అంటే మాత్రం హైదరాబాద్ ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. 


ఈ వర్షం కురిసేది కాసేపు అయినా ట్రాఫిక్ జామ్ అయ్యేది మాత్రం గంటలు గంటలు. చిన్న వర్షానికి కూడా ట్రాఫిక్ ఫుల్ గా ఉంటుంది. చిన్న వర్షమే అయినా హైదరాబాద్ లో ఉండే రోడ్ల కారణంగా ఎక్కడి నీళ్లు అక్కడ నిలిచిపోతాయి. అలా ఆ నీరు నిలిచిపోవడం వల్ల దోమలు వస్తాయి. ఆ వచ్చిన దోమలు ఇళ్లలోకి దూరి కుట్టి కుట్టి..  పెద్ద పెద్ద రోగాలను తెప్పిస్తున్నాయి. 


ఆ దోమలు కుట్టడం వల్ల వైరల్ ఫివర్లు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు కట్టగట్టుకొని వచ్చి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులన్నింటిని ప్రజలతో నింపేస్తున్నాయి. ఒకవేళ ఆ దోమలు కూడా ప్రజలను ఆసుపత్రికి పంపలేదు అంటే హైదరాబాద్ రోడ్లపై ఉండే గుంతలు ప్రజలను ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. ఎలా అయినా సరే ఆసుపత్రికి పోకుండా మాత్రం ఉండలేకపోతున్నారు ఈ హైదరాబాద్ ప్రజలు. మరి వీరికి ఎప్పుడు పోతాయో ఈ కష్టాలు. ఇది హైదరాబాద్ కాదు హైదరాబాదుడే అని అంటున్నారు ప్రజలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: