కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటే.. ఇదే అదనుగా రెచ్చిపోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా భారత్ పై కోపంగా ఉన్న కాశ్మీరీలను రెచ్చగొట్టి దేశంలో చిచ్చుపెట్టేందుకు కంకణం కట్టుకుంది.


అందుకే సరిహద్దుల వెంట భారీగా ఉగ్రవాదులను మోహరిస్తోందట. దాదాపు 500 మంది టెర్రరిస్టులు కాశ్మీర్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారనిట. ఈ విషయాన్ని భారత సైన్యం పసిగట్టింది. వీరిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


జమ్ముకాశ్మీర్ లో చొరబడే అవకాశం కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద వీరంతా కాపు కాశారట. పీవోకేలో అనేక శిక్షణ శిబిరాల్లో వీరంతా మాటు వేసుకున్నారట. అక్కడే వీరికి కొందరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట. జమ్మ కాశ్మీర్‌లో అల్లర్లు సృష్టించడానికి.. పాక్‌ సహకారంతో రెండు నుంచి మూడొందల మంది ఉగ్రవాదులు కాశ్మీర్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు.


శిబిరాల్లో ఉగ్రవాదులకిచ్చే శిక్షణ సమయాన్ని బట్టి ఈ సంఖ్య ఎప్పటికప్పుడు మారుతుంటుందని ఆ భారత్ సైనికాధికారి వివరించారు. అయితే ఈ విషయంలో భారత్ భయపడాల్సింది ఏమీ లేదు. టెర్రరిస్టులు ఎన్ని వందల మంది గీత దాటే ఛాన్సున్నావారిని అదుపు చేసే సత్తా మన సైన్యానికి ఉందని అధికారులు చెబుతున్నారు.


కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత వరకూ విదేశాల సాయం పొందాలనుకున్నా.. అది సాధ్యపడలేదు. అంతర్జాతీయంగా కాశ్మీర్ విషయంలో ఒంటరి అయ్యింది. ఇక భారత్ ను దెబ్బ తీసేందుకు ఆ దేశానికి ఉన్న వక్రమార్గం టెర్రరిజమే కదా. అయితే ఆ పప్పు ఇండియా ముందు అంత సులభంగా ఉడకవని పాక్ కు కూడా తెలుసు.


మరింత సమాచారం తెలుసుకోండి: