పలువురు పరిశ్రమ వర్గాలు ఆర్థికంగా నిపుణులతో సమావేశం నిర్వహించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ . కాగా శ ఈ సమావేశంలో పలువురు జీఎస్టీ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని... జీఎస్టీ  విధానాన్ని విమర్శిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై  పలు ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ పై వస్తున్న విమర్శలపై స్పందించిన  నిర్మల సీతారామన్... వాటిని విమర్శలను ఖండించారు . పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో జీఎస్టీ విధానం   ఆమోదింపబడిందని ఆమె తెలిపారు .అలాంటి జీఎస్టీ విధానాన్ని  తప్పు పట్టడం సరికాదంటూ నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే జి.ఎస్.టి వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ... జీఎస్టీ విధానాన్ని మాత్రం పూర్తిగా తప్పు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 

 

 

 

 

 ఒకవేళ జిఎస్టి విధానంలో ఏదైనా లోపాలు ఉంటే   మెరుగైన జీఎస్టీ విధానా రూపకల్పనకు సలహాలు సూచనలతో ముందుకు రావాలని పిలుపు నిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్... జీఎస్టీ విధానాన్ని మెరుగుపరిచేందుకు సమావేశంలో కొంతమంది నిపుణులు ఇచ్చిన సలహాలను స్వీకరించారు. అంతేకాకుండా నిర్మాణాత్మక సూచనలతో కేంద్ర ఆర్థిక శాఖతో  చర్చించేందుకు...నిపుణులు  ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిఎస్టి వసూళ్లు క్షిణించటం పై  స్పందించిన నిర్మల సీతారామన్... జీఎస్టీ వసూళ్ల తగ్గుదలకు గల  అసలైన కారణాలు కనుగొనడానికి... ఆర్థిక శాఖ ఒక కమిటీని నియమించింది తెలిపారు.

 

 

 

 

 జిఎస్టి లో  ఉన్న లోపాలను సరి చేసేందుకు... మెరుగైన జీఎస్టీ   విధానం అమలు చేసేందుకు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని లోపాలు సరి  చేసేందుకు ఆర్థిక శాఖ ప్రయత్నిస్తుందని నిర్మల సీతారామన్ తెలిపారు . కానీ జిఎస్టి స్వల్ప లోపాలున్నప్పటికీ ... ఆ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించడం తగదన్నారు. జీఎస్టీ వసూళ్ల క్షీణించడానికి కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు కూడా కారణమయ్యాయని... ప్రకృతి విపత్తుల  కారణంగా కూడా జీఎస్టీ వసూళ్లు  తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: