నూతన మద్యం పాలసీతో ఈ మధ్య మందు షాపులు రాత్రి 8 గంటలకే బంద్ కాగా., ఈ పరిస్థితి ని బార్‌ నిర్వాహకులు అనుకూలంగా మలుచుకున్నారు. మందు లేదని జనాలు బీర్ల కోసం ఎగబడుతున్నారు., ఇదే అదునుగా లిక్కర్‌ ధరలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు రూ.లక్ష కూడా దాటని ఓ బార్‌ కౌంటర్‌.. ఇప్పుడు రూ.4 లక్షలు దాటిపోతోంది. 

నూతన ఎక్సైజ్‌ పాలసీతో ‘చుక్క’లు చూపించేందుకు గాను జగన్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో ఇటీవలే నూతన ఎక్సైజ్‌ పాలసీని తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో 247 మద్యం షాపులుండగా.. దాన్ని 197కు కుదించింది.  మద్యంషాపుల వేళల్లోనూ మార్పులు చేసింది. దీంతో రాత్రి 8 గంటలకు మద్యం షాపులు మూతపడుతున్నాయి. ఇక పర్మిట్‌షాపులను పూర్తిగా రద్దు చేయడంతో మద్యం ప్రియులంతా బార్ల బాట పడుతున్నారు. జిల్లాలో 32 బార్‌లు ఉండగా..అన్నింటిలోనూ గతంతో పోలిస్తే రెట్టింపు వ్యాపారం జరుగుతోంది. బార్‌ నిర్వాహకులు  లిక్కర్‌పైనే కాకుండా వాటర్‌బాటిళ్ల నుంచి ఆహార పదార్థాల వరకూ భారీ రేట్లు అమలు చేస్తున్నారు. దాబాలతో పోలిస్తే  50 నుంచి 60% కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. అధికారులకు మామూళ్లుతో పాటు వారు వచ్చినప్పుడు మర్యాదలు చూసుకుంటుండడంతో అధికారులెవరూ పెద్దగా పెట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తన్నాయి. దీనిపై ప్రభుత్వం వారు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు... దీనికి గాను బార్లలో మద్యం రేట్లను కంట్రోల్‌ చేసే పరిస్థితి లేదని ఇన్‌చార్జ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌  చెబుతున్నారు.. సర్వీసు పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారనీ.., త్వరలో బార్ల వేళల్లోనూ మార్పులు చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తోందని, అది అమలైతే వారికి కూడా చెక్‌ పడుతుందన్నారు.  ఏది ఏమైనా ప్రభుత్వం ఓ అడుగు ముందే ఉంది ఈ విషయంలో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: