బీడ్ జిల్లా కలెక్టర్ అస్తీక్ కుమార్ పాండే  తప్పు చేశాను,కాబట్టి జరిమానా కడుతున్నాఅని చెప్పి,అందరికి ఆదర్శంగా నిలిచారు. చట్టం విషయం లో ఎవరైనా ఒక్కటే అని చెప్పి జరిమానా కూడా కట్టారు.విషయానికి వస్తే  మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కలెక్టర్ అయినా  అస్తీక్ కుమార్ పాండే ఇటీవల ప్లాస్టిక్ కప్పులో టీ తాగుతుంటే ,దాని చూసిన  ఓ విలేకరి ఆయన్ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ వస్తువులపై  పూర్తిగా నిషేదం ఉన్నప్పుడు,మీరు మాత్రం ప్లాస్టిక్ కప్‌లో టీ తాగడం నిబంధనలు అతిక్రమించినట్లు కాదా అని నిలదీయగా, వెంటనే  కలెక్టర్ తనకు తాను రూ.5000 జరిమానా విధించుకున్నారు.ఇక మీదట ప్లాస్టిక్ పూర్తిగా నిషేదించాలని తెలిపుతూ,నేను తప్పు చేశాను కాబట్టి జరిమానా కూడా కడుతున్నా,మునుముందు ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే ప్రజలకు కూడా ఆదర్శంగా నిలిచి రూల్స్ ఫాలో అవుతారు అని ఆకాంక్షిద్దాం.చట్టం ముందు నేను అయినా ,ప్రజలయిన ఒక్కటే అని తనకు తానే జరిమానా విధించుకున్న తీరును చూసి అందరు హర్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీడ్ జిల్లాలో అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణ వివరాలను తెలిపేందుకు కలెక్టర్ విలేకరులతో  సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విలేకర్లు అందరికి  ప్లాస్టిక్ డిస్పోజల్ కప్పుల్లో టీ ఇచ్చారు. దీంతో  ఓ విలేకరి  కలెక్టర్‌ను నిలదీశారు.

ప్లాస్టిక్ వస్తువులపై నిషేదాన్ని ముందు  మీరే కార్యాచరణ చేయకపోతే.. సాధారణ ప్రజలు ఎలా పాటిస్తారు అని  ప్రశ్నించగా, దీంతో కలెక్టర్ గారు వెంటనే  తమ తప్పిదాన్ని తెలుసుకుని ,అటెండర్ చేసిన  పనికి  తానే  పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని వివరించి ,వెంటనే తనకు తాను రూ.5వేలు జరిమానా విధించుకున్నారు. ప్రెస్‌మీట్ తర్వాత సిబ్బందితో సమావేశమైన కలెక్టర్ గారు .. ఇక మీదట ఏ కార్యాలయంలో ,ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని  ఆర్డర్లు జారీ చేసారు అందరికి .


మరింత సమాచారం తెలుసుకోండి: