హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ గా  మారుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి అమ్మాయిల్ని తీసుకొనివఛ్చి నగరంలో వ్యభిచార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. నిన్న పోలీసులకు ఒక ముఠా గురించి పక్కా సమాచారం అందటంతో పోలీసులు కాకతీయ నగర్ లో ఫ్లాట్ పై దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలైన సిరాజుద్దీన్, రజియా ఈ అశ్లీల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లో హైటెక్ పద్ధతిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలను, కొంతమంది విటులను, నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 36 కండోమ్ ప్యాకెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, 6,580 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
నేరెడ్ మెట్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్ ఓ టీ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. పిటా యాక్ట్, 370 ఎ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం గురించి గతంలో కూడా కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ దర్యాప్తు సంస్థ గత నెలలోనే మనుషుల అక్రమ రవాణాను హైదరాబాద్ నగరంలో గుట్టు రట్టు చేసింది. 
 
ఛత్రినాక పోలీసుల సహాయంలో బంగ్లాదేశ్ కు చెందిన యువతులను అక్రమంగా హైదరాబాద్ తీసుకొనివచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. పాత బస్తీకి చెందిన భార్యాభర్తలు ఈ కేసులో ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు యువతులు పట్టుబడగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు యువతులను వారి దేశానికి తిప్పి పంపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: