ఆర్టీసీ స‌మ్మె ఎఫెక్ట్ ఇప్పుడు విద్యాశాఖ పై ప‌డింది. ఇప్ప‌టికే ద‌స‌రా సెలవులు ఎన్న‌డు లేని విధంగా 16రోజులు సెలవులు ఇవ్వ‌గా ఇప్పుడు ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో మ‌రిన్ని రోజులు సెల‌వుల‌ను పొడిగిస్తే తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఆర్టీసీ జేఏసీ ఈరోజు బస్ భ‌వ‌న్ ముట్ట‌డించ‌డంతో, ఈ ముట్ట‌డిలో బీజేపీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ గాయ‌ప‌డ‌టం జరిగాయి. దీనికి తోడు ఆర్టీసీ జేఏసీ ఈనెల 19 తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వ‌గా, ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ‌లోని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో తెలంగాణ‌లో త‌లెత్తిన ప‌రిస్థితుల‌ను, ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో ప్ర‌త్యామ్న‌య ఏర్పాట్లు, ఇంకా ప్ర‌జ‌లు ఎదుర్కోంటున్న ఆర్టీసీ స‌మస్య‌ను ఎదుర్కోవ‌డంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌లు పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌తస్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, విద్యాశాఖ మంత్రి పి.స‌బితా ఇంద్రారెడ్డితో పాటుగా, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ పై సుధీర్ఘంగా చ‌ర్చించిన సీఎం కేసీఆర్ ద‌స‌రా సెల‌వుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించారు.


ఈనెల 19 వ‌ర‌కు ద‌స‌రా సెలవుగా పొడిగిస్తూ, విద్యాసంస్థ‌లు తెరువ‌రాదని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే విద్యాసంస్థ‌ల బ‌స్సులు ఎక్కువ‌గా ప్ర‌యాణికుల‌ను చేర‌వేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. దీంతో ఇప్పుడు విద్యాసంస్థ‌లు తెరిస్తే విద్యాసంస్థ‌ల బ‌స్సులు తిరిగి విద్యాసంస్థ‌ల‌కు వెళ్ళిపోతాయి. అందుకే ద‌స‌రా సెల‌వును పొడిగించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. విద్యాసంస్థ‌లు ఈనెల 14న తిరిగి తెరుచుకోనున్న నేప‌థ్యంలో ఇప్పుడు సెల‌వులు 19వ వ‌ర‌కు పెంచ‌డంతో చ‌రిత్ర‌లో ఎప్పుడు లేని విధంగా 22రోజులు సెల‌వులు ఇవ్వ‌డం విశేషం. 22 రోజుల సెల‌వులు అంటే ఇది రికార్డు సెలవులే.. విద్యాసంస్థ‌లు తిరిగి ఈనెల 21న తెరుచుకోనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: