గుజరాత్‌ తీరంలో పాకిస్థాన్‌ పడవ కలకలం రేపింది. గుజరాత్‌ తీరానికి అత్యంత సమీపంలో ఈ పడవలు అనుమానాస్పదంగా కన్పించడంతో, అప్రమత్తమైన సరిహద్దు భద్రతా సిబ్బంది (బీఎస్ఎఫ్‌) వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే గత కొన్నాళ్లుగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సరిహద్దుల వద్ద చీమ చిటుక్కుమన్నా భద్రతా బలగాలు అప్రమత్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించేందుకు సముద్ర మార్గాలను ఆశ్రయిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న ఈ నేపథ్యంలో భారత తీరంలో పడవలు ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది.


శుక్రవారం రాత్రి 10.45 గంటలకు బీఎస్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతుండగా ఈ పడవలు కనిపించాయి. తీర ప్రాంతం గుండా పాక్ ఉగ్రవాదులు ఈ పడవల్లో వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్న బలగాలు వెంటనే అప్రమత్తమై, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇంతవరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదు.  ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, పాక్ ఉగ్రవాదులు తీర ప్రాంతం గుండా ఐదు పాక్ మత్స్యకారుల పడవలతో భారత్‌లోకి చొరబడి ఉండవచ్చునని ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది.


ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకోవడంతో పాకిస్థాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. సరిహద్దు వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్‌‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370 పరిణామాల అనంతరం పాకిస్తాన్ ఎలాగైనా భారత్ లో దాడులు జరపాలని అన్ని ప్రయత్నాలను చేస్తుంది, ఇకపోతే మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న సగంతి తెలిసిందే. ఈ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటంలో అర్ధమేంటో ?

మరింత సమాచారం తెలుసుకోండి: