సీతయ్య ఎవరిమాటా వినడు అన్నట్లు - తెలంగాణా చందృడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది 100% లేదని కుండబద్ధలు కొట్టరు.అంతే కాదు ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయబోమని సుస్పష్టంగా చెప్పారు. ఈ ప్రజా రవాణా సంస్థను 50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, మరో 20 శాతం ప్రయివేట్ బస్సులు అనే మూడు భాగాలు విభజిస్తామన్నారు. 


అంతేకాదు దసరా పండుగవేళ సమ్మెకు చేస్తున్న సిబ్బందిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యోగులు తమంటతామే ఉద్యోగాలను పోగొట్టుకున్నట్టేనన్నారు దీంతో అధికారికంగా 48 వేల మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయినట్టయ్యింది. అడగటమే ఆలస్యం అన్నట్లు తన మొదటి పాలనాకాలంలో ఎవరు ఏం అడిగినా కాదనకుండా అందించిన కేసీఆర్, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కఠినంగా వ్యవహరిస్తున్నారు.


2015లో ఆర్టీసీ సిబ్బంది అడిగినదాని కంటే ఎక్కువగా 44 % ఫిట్‌మెంట్ ఇచ్చిన కేసీఆర్, నేడు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎలాంటి అవకాశం లేదని అన్నారు.  ఆర్టీసీని అభివృద్ది పరచి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు, ఈ రవాణా సంస్థను సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం ఇప్పటికే స్థిర నిర్ణయం చేశారని ఇక ఎవరి మాట వినేందుకు ఆయన సిద్ధంగా లేరని ఆయన తీరును చూస్తే అర్థం అవుతోంది.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KCR' target='_blank' title='kcr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kcr</a>  to target Revenue Department & VROs

ఇక నెక్స్ట్ ఏమిటి అనేదానికి - ఆర్టీసీ సమస్యను సరిచేశాక కేసీఆర్ తమను ఎక్కడ లక్ష్యం చేసుకుంటారో? అని  మిగతా ప్రభుత్వశాఖల ఉద్యోగులు భయపడుతున్నారు.
కేసీఆర్ ఆలోచనలు ఎరిగినవారు ఆయన తదుపరి లక్ష్యం "రెవిన్యూ విభాగం, వీఆర్వోలు మాత్రమేనని భావిస్తున్నారు. వీఆర్వోల వ్యవస్థపై ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో తన పూర్తి అసంతృప్తిని ప్రకటించారు.


రెవిన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. శాసనసభ సాక్షిగా వీఆర్వోలపై కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "కుక్క తోకను ఊపాలి కానీ.. తోక కుక్కను ఊపకూడదు" అంటూ ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా రెవెన్యూ విభాగాన్ని దానిలోని వీఆర్వోలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో కలకలం రేపాయి. రెవిన్యూ విభాగం పేరును "భూమాత" గా మార్చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. పేరు నుండి మొదలెట్టి "రేవెన్యూ శాఖ ఫేస్ లిఫ్ట్" చేస్తారన్న మాట.  
Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KCR' target='_blank' title='kcr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kcr</a>  to target Revenue Department & VROs
కేసీఆర్ - ఆర్టీసీ సంగతి చూశాక రెవిన్యూ విభాగం, వీఆర్వోలపై తన దృష్టి కేంద్రీకృతం చేసే అవకాశాలున్నాయి. కొత్త పురపాలక చట్టం ద్వారా పురపాలకశాఖ ఉద్యోగులను కూడా ముఖ్యమంత్రి ఒక చూపు చూస్తారని ఆనోట ఈనోటా వినిపిస్తున్నాయి. ప్రజలకు మేలు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళనచేసే దిశగా కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయవర్గాల నుండి వినిపిస్తున్న మాట. మొత్తం మీద ఇప్పటికైనా రెవెన్యూ విభాగంలో ఉన్నంత అవినీతి అక్రమాలు ఎక్కడా ఉండవు అనేది జనాభిప్రాయం. 


పరిశీలకుల అభిప్రాయం ప్రకారం కేసీఆర్, ఆర్టీసీ సమ్మెతో కోల్పోయిన ప్రభుత్వ ప్రతిష్ఠను మొండిగా కొనసాగించైనా - కుళ్ళి కృశించి కంపుగొడుతూ ప్రజాబిమానం కోల్పోయి అందరిచే తిట్లు శాపనార్ధాలు పొందుతున్న  రేవెన్యూశాఖను ప్రత్యేకించి, వీఆరోలపై దృష్టి కేంద్రీకరించి దానిని ప్రక్షాళన చేసి కోల్పోయిన కీర్తిని తిరిగి పొందొచ్చని ఆలోచనగా చెపుతున్నారు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KCR' target='_blank' title='kcr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kcr</a>  to target Revenue Department & VROs


మరింత సమాచారం తెలుసుకోండి: