కేంద్ర ప్రభుత్వం దేశంలో జరుగుతున్న యాక్సిడెంట్స్ ను అరికట్టేందుకు కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ కొత్త వాహన చట్టం ప్రకారం రూల్స్ పాటించకుంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు.  భారీ జరిమానాలు కట్టడం కంటే రూల్స్ పాటిస్తే దాని వలన మంచి జరుగుతుందిగాని చేదు జరగదు అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారు.  చాలా వరకు దేశంలో ప్రజలు ఇప్పుడిప్పుడే రూల్స్ ఫాలో అవుతున్నారు.  


ఈ సమయంలో కొంతమంది నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఈ రోల్స్ ను బ్రేక్ చేస్తూ.. వితండవాదం చేస్తున్నారు.  ఇలా బ్రేక్ చేస్తూ మాట్లాడి పార్టీకే కాకుండా వారికి కూడా చేటు చేసుకుంటున్నారు.  అలాంటి వాళ్లలో ఒకరు పరిణయ్.  ఈయన మహారాష్ట్ర మంత్రి.  ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది.  ఈనెల 21 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ రోజు అక్కడ ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించబోతున్నారు.  


ఈ ఎన్నికల ప్రచారం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు మోడీ సాకోలి నియోజక వర్గంలో ప్రచారం చేయబోతున్నారు.  ఈ సాకోలి నియోజక వర్గం నుంచి పరిణయ్ పోటీ చేస్తున్నారు.  బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి.. ట్రాఫిల్ రూల్స్ బ్రేక్ చేసి సభకు హాజరు కావాలని కార్యకర్తలను కోరటం ఏంటో అర్ధంకాని విషయం.  ద్విచక్రవాహనాలపై అవసరమైతే ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కి రండి.. ట్రాఫిక్ పోలీసులు ఆపితే నాపేరు చెప్పండి.. అప్పటికి వదలకపోతే నేను మిమ్మల్ని విడిపిస్తాను అని మాట్లాడారు.  


ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.  ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాహన చట్టం అమలు చేస్తే.. దాన్ని ఎన్నికల కోసం, ప్రజా సమీకరణం కోసం ఇలా రూల్స్ బ్రేక్ చేసి సభకు రమ్మని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటి.  మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త వాహన చట్టాన్ని అమలు చేస్తున్నది.  మంత్రి చెప్పారు కదా అని వస్తే.. జరగటానికి ఏదైనా జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు.  ప్రభుత్వం భాద్యత వహిస్తుందా.. సమస్య లేదని అంటుంది.  మోడీ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని ఆ మంత్రిని తొలగిస్తే బాగుంటుంది.  లేదంటే దీనిని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: