కేంద్రమంత్రి  రవి శంకర్ ప్రసాద్ ఒక అద్భుత ఆర్ధికవేత్తలా స్పందించారు. అంతేకాదు ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమ, తయారి పరిశ్రమ, ఐటి ఇండస్ట్రీ, ముద్ర ఋణాలు, వాణిజ్యం, సేవల విభాగాలు చక్కగానే పనిచేస్తున్నాయని ఉటంకించారు. అదికాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలో భారత్ ప్రపంచంలో 11 వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఫ్రాన్స్ ను సైతం తలదన్ని ప్రపంచ స్థాయిలో 5 వ ప్రభల ఆర్ధిక శక్తిగా నిలిచిందని ప్రవచించేశారు.  


ఆర్ధికంగా మనం బలంగా ఉన్నామని చెపుతూ ఈ విషయం ఉదహరించారు ఏమంటే మూడు సినిమాల ముచ్చటగా ₹120 కోట్లు ఆర్జించిన దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు విస్తరించి ఉన్నాయన్న ఆందోళనలను కలకలాన్ని కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ ఖండించారు.

 

దాని ఉదాహరణగా మహాత్మా గాంధి జయంతి రోజున విడుదలైన  మూడు బాలీవుడ్ చిత్రాలు ₹ 120 కోట్లు పైగా ఆర్జించాయని, ఇది చాలు మనదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో  వివరించటానికి అంటూ - అర్థం చేసుకోవచ్చని  తన వాదనను, తన ఙ్జానాన్ని భారత ప్రజలపై కృమ్మరించారు. 


“అక్టోబర్ 2న మూడు సినిమాలు విడుదలయ్యాయి. అవి రికార్డు సృష్టిస్తూ ఒకే రోజు ₹120 కోట్లు ఆర్జించినట్టు చలనచిత్ర వ్యాపార విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పారు. దేశ ఆర్థిక పరిపుష్టత వల్లే ఇంతపెద్ద మొత్తంలో వ్యాపారం జరిగింది' అని రవిశంకర్ మీడియాతో అన్నారు. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులున్నాయనే ఆందోళనల్లో అర్ధం లేదనే విషయం దీనిని బట్టే అవగాహన చేసుకోవచ్చని విశ్లేషించారు.

 

నేషనల్ శాంపిల్ సర్వే అఫీస్ డాటాపై మాట్లాడుతూ, తాము ఇచ్చిన 10 రకాల గణాంకాలను ఎక్కడా నివేదికలో చూపించలేదన్నారు.'ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు. కొంత మంది వ్యక్తులు వ్యూహాత్మకంగా తప్పదారి పట్టిస్తున్నారు'  అని రవిశంకర్ అన్నారు. నేషనల్ శాంపుల్ సర్వే మన దేశ నిరుద్యోగిత గత నలభై ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిందంటున్నారు. అది 2017-18 సంవత్సరానికి 6.1 గా ఉందని ఒక ప్రముఖ ఆర్ధిక పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ను ఉటంకిస్తూ - అసలు 1972-73 మరియు 2011-12 ఆర్ధిక సంవత్సరాలకు గాను నిరుద్యోగిత అది 2.2% మాత్రమేగా రికార్డైదని అన్నారు. 

 

దేశంలో ఆర్థిక మందగమనం లేదని ఒకవైపు shankar PRASAD.' target='_blank' title='రవిశంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవిశంకర్ ప్రసాద్ చెబుతుండగా, ఆర్థిక మందగమన పరిస్థితులపై ఆయా రంగాల వారీగా నిర్దిష్ట పరిష్కారానికి క్రమం తప్ప కుండా ప్రయత్నాలు సాగిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ఆర్థిక వృద్ధిని పునఃరుద్ధరించేందుకు కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గించామని ఆమె పేర్కొన్నారు.

 

ఆటోమొబైల్ రంగంతో పాటు ఏ రంగానికి చెందిన ప్రతినిధులకైనా తాను ఎప్పుడూ అందుబాటు లోనే ఉంటున్నానని, వారు నేరుగా తమ సమస్యలను, డిమాండ్లను తనతో చర్చించవచ్చని తెలిపారు. మరి బీజేపీ నేతలే ఆర్ధిక మందగమనంపై భిన్న విభిన్న వాదనలు చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: