జాతీయ స్థాయిలో ఇప్పటికే నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు మరిన్ని తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఆ పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. సీనియర్‌ నేతలు, ఒకప్పుడు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారే.. మోదీని పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. ఇది ఆ పార్టీలోని లుకలుకల్ని బయటపెడుతోంది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు విషయంలోనే పలువురు నేతలు పార్టీ వైఖరికి భిన్నంగా.. మోదీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించడం తెలిసిందే.


ఇక ఈ దశలో రాష్ట్రంలో కాంగ్రెస్ పునర్‌వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతే లేదు. స్వయంగా రాహుల్‌ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్‌ తన్వర్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్‌ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్‌ని నిరాశాభావం వెంటాడుతోంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.


అంతే కాకుండా కాంగేస్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారేలా ఆ పార్టీ శ్రేణులు ప్రవర్తిస్తున్నారని సమాచారం. ఇదేగాక ఈ నెల 21న హర్యానా శాసనసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్‌ను పూర్తిగా నాశనం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ కోశాధికారి అహమద్ పటేల్ హర్యానా ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడాపై ఘర్షణ పడడమే ఇందుకు తాజా నిదర్శనం.


అహమద్ పటేల్ పార్లమెంటు ఆవరణలో పార్టీ ప్రధాన కార్యదర్శి, హర్యానా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ సమక్షంలో భూపేందర్ సింగ్ హూడాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇదేగాక ఒక రకంగా  కార్యచరణలో  ఘోరంగా విఫలమవుతున్న  కాంగ్రేస్ ఈ ఎలక్షన్స్‌లో  బిజేపిని  ప్రణాళికబద్దమైన ఆలోచనలతో ఎదుర్కొని గట్టిపోటినివ్వకపోవడం ఆ పార్టీ బలాబలాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: