దేశం మొత్తం ఆర్థిక మందగమనం ఎఫెక్ట్  తో అల్లాడుతోంది. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అన్ని రంగాల్లో ఉంది. అయితే ఆర్థిక మాంద్యం వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని భావించిన కేంద్రం... పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక మందగమనం తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ బ్యాంకుల విలీనం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆర్థిక మందగమనం ఎఫెక్ట్  అన్ని రంగాలపై  తీవ్రంగా పడింది. అందుకే ఆటోమొబైల్ రంగంలో ఆయా సంస్థలు ఉద్యోగులను తొలగించి ఆలోచనలో కూడా ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం  తగ్గించేందుకు కేంద్రం కూడా పలు చర్యలు చేపట్టిందని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా పలుమార్లు తెలిపిన విషయం తెలిసిందే. 

 

 

 

 

 అయితే దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం పై కేంద్ర మంత్రి shankar PRASAD.' target='_blank' title='రవిశంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవిశంకర్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం సాగుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర మంత్రి shankar PRASAD.' target='_blank' title='రవిశంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. దేశంలో  పూర్తి ఆర్థిక పరిపుష్టత  ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పూర్తి ఆర్థిక పరిపుష్టత  ఉందని నిరూపించడానికి తాజాగా విడుదలైన సినిమాలు ఇందుకు నిదర్శనం అన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఒకే రోజు విడుదలైన 3 బాలీవుడ్  సినిమాలు ఒక్కరోజులోనే  120 కోట్లు వసూళ్లు రాబట్టాయని ... దీన్ని బట్టి చూస్తే మన దేశంలో ఆర్థిక పరిపుష్టి త ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి shankar PRASAD.' target='_blank' title='రవిశంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 

 

 

 

 

 కాగా  అక్టోబర్ 2 న విడుదలైన మూడు సినిమాలు ఒకే రోజు 120 కోట్లు వసూలు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు కోమల్ సహిత చెప్పారని... దేశంలో ఆర్థిక మందగమనం ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని... దేశంలో ఆర్థిక పరిపుష్టత బలంగా ఉంది కాబట్టి అన్ని కోట్ల వసూళ్లు  సాధ్యం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. దీన్నిబట్టి దేశం ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతున్నది అని  వస్తున్న వార్తలు నిజం కాదని అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇక దేశ ప్రజలందరూ దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయని ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి shankar PRASAD' target='_blank' title='రవి శంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.కాగా  కేంద్రమంత్రి చేసిన సరికొత్త వాదన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా తాము ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని... కొంతమంది కావాలని తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: