ప్రేమ ఇది రెండు అక్షరాలే కావొచ్చు.. అంతకు మించిన గొప్ప బంధం.  ప్రేమ అన్నది ఎంత గొప్ప విషయం అంటే మనకు తెలియకుండానే మనల్ని సప్త సముద్రాలు దాటేలా నిలబెట్ట గలుగుతుంది.  సప్త సముద్రాలను ఈదుకుంటూ వెళ్ళడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.  అడవులు, కొండలు, కోనలు ఇవన్నీ కూడా దాటేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  అలాంటి మహత్యం ఉన్నది ప్రేమకు.  
ప్రేమించే మనసు ఉంటె చాలు.  ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమలో పడొచ్చు.  ప్రేమను ప్రేమగా చాటుకోవచ్చు.  ప్రేమించడానికి ప్రేమించే హృదయం ఉంటె చాలు.  అది ఎంత దూరమైన మనిషిని తీసుకెళ్తుంది.  ఎంత గొప్ప పనులైనా చేయిస్తుంది.  ప్రేమించే మనసు ఉంటె .. వాళ్ళు ఎవరితో అయినా ప్రేమలో పడొచ్చు.  అందులో తప్పులేదు.  కొంతమందికి బంగారం అంటే ప్రేమ ఉంటుంది.  కొంతమందికి డబ్బంటే ప్రేమ ఉంటుంది.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రేమ ఉంటుంది.  


లవ్ ఎట్ ఫైట్ సైట్ అంటారు. మొదటి చూపులోనే ప్రేమ పుడుతుంది.  ప్రేమించడం మొదలుపెడితే ఆ ప్రేమకు అంతం ఉండదు.  ప్రేమించేవాళ్లు మన ముందు ఉంటె చాలు అంతకు మించి మరేమి అక్కర్లేదు అనుకుంటారు.  బెర్లిన్ కు చెందిన 30 ఏళ్ల మిచెలే కబ్కి అనే మహిళ లవ్ ఎట్ ఫస్ట్ ఫ్లైట్ అని అంటోంది.  అదేంటి తొలిచూపులోనే విమానంలో ప్రేమలో పడటం ఏంటి అని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా.. 


మిచెలే 2013 వ సంవత్సరంలో తొలిసారిగా విమానం ఎక్కింది.  ఆ తరువాత 2014 వ సంవత్సరంలో బోయింగ్ 737 విమానం ఎక్కింది.  దాన్ని చూడగానే తెలియని ప్రేమ కలిగింది. ఆ తన్మయత్వం నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది.  ఆ క్షణం నుంచే బోయింగ్ 737 విమానాన్ని ప్రేమించడం మొదలు పెట్టింది.  దాన్నే తన ప్రేమికుడిగా ఆరాధిస్తూ ఉండిపోయింది. ఇటీవలే 2019 మే 1 వ తేదీన మరలా బోయిన్ 737 ఎక్కింది.  ఆ విమానాన్ని చూడగానే వెళ్లి గట్టిగా హత్తుకుంది.  ముద్దు పెట్టుకుంది.  పదేపదే విమానాశ్రయంలోకి వెళ్లాలన్నా కుదరదు.  అందుకే బోయిన్ 737 ఆకృతితో ఉండే ఫైబర్ విమానాన్ని తయారు చేయించుకొని తన ఇంట్లో పెట్టుకుందట.  నిత్యందాన్ని ముద్దాడుతూ  దానితోనే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: