ఆర్ధిక మాంద్యంలో వినియోగదారుని స్పందనకు అనుగుణంగా - దినదిన గండం నూరేళ్లా ఆయుష్షు అన్న చందాన - భారత ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటిన వేళ, రూపీ విలువ పడిపోయి ద్రవ్యోల్బణం మింటివైపు చూస్తున్న తరుణంలో వాహనాలు ఎవరు కొంటారు? ఇది కామన్సెన్సుకు అందే విషయమే. 
 (Photo: Ramesh Pathania/Mint)
ఆర్ధిక మందగమనానికి ఇది సాధారణ న్యాయసూత్రమే ఇది. నిత్యావసరాలే కొనుగోలు చేయలేని వేళ విలాసవస్తువుల జోలికి ఎవరూ వెళ్ళరు. ఈ సహజ న్యాయ సూత్రం మాత్రం అత్యంత ఉన్నత విలాస వాహనాలకు వర్తించదు. ఎందుకంటే వాటిని కొనే వర్గాలకు "విలాసమే ముఖ్యం-సంపాదన మాత్రం కాదు"

ఆటోమొబైల్ పరిశ్రమలో అమ్మకాల క్షీణత మొదలై వరసగా 11 నేలలు గడిచిపోయాయి. ఇలా ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించటం చూస్తూ ఉంటే ఇప్పట్లో ఈ పరిశ్రమ కోలుకునే అవకాశాలు లేదా చాయలు కనిపించడం లేదు. 

సెప్టెంబర్ నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 23.69 శాతం పడిపోయి కేవలం 2 లఖల 23 వేల 317 యూనిట్లు మాత్రమే అమ్మకం జరిగింది. 2018 సెప్టెంబర్ నెలలో 2 లక్షల 92 వేల 660 యూనిట్ల ప్రయాణికుల వాహనాలు అమ్ముడయ్యాయి.  సెప్టెంబర్ నెల వాహన విక్రయాల లెక్కలను "సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ - సి ఐ ఏ ఎం" గత శుక్రవారం విడుదల చేసింది. దేశీయకార్ల అమ్మకాల్లో 33.4 శాతం క్షీణత నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 1లక్ష 97వేల 124 యూనిట్ల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది అదే నెలలో 1లక్ష 31వేల 281 యూనిట్లకు పరిమితమైంది.

Image result for automobile industry in deep waters in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> september

ఇక మోటారు సైకిళ్ల అమ్మకాలు 23.29 శాతం తగ్గి 10 లక్షల 43 వేల 624 యూనిట్లకు పరిమితమైనాయి. మరో వైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22.09 శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలు 39.06 శాతం తగ్గాయి. అన్ని తరగతుల వాహనాలు సెప్టెంబర్ నెలలో 20 లక్షల 4 వేల 932 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 సెప్టెంబర్ నెలలో విక్రయించిన 25 లక్షల 84 వేల 62 యూనిట్లతో పోలిస్తే ఇది 22.41 శాతం క్షీణతగా అని సియామ్ పేర్కొంది.సంక్షోభం నుంచి బయట పడేందుకు, కొనుగోలు దారుల ను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి.
Why has <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MARUTI' target='_blank' title='maruti -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>maruti </a>cut down on production? (Pic dated 2012) 

మరింత సమాచారం తెలుసుకోండి: