రోడ్లపై రయ్ రయ్ మని తిరిగే బస్ లు మూగ బొయ్యాయి.ప్రైవేట్ బసుల్లో దోపిడీ బీభత్సంగా మారిపోయింది.ఆర్టీసీ సమ్మె ఉధృతంగా తయారైంది. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పాల్పడుతున్నారు. టెంపరరీ సిబ్బందితో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమైనా తాత్కాలిక సిబ్బంది చేతివాటం ఆ శాఖపై చెరగని ముద్ర వేస్తోంది.అడ్డగోలుగా జనాల నుంచి డబ్బులు పిండుకుంటూ దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు కొకొల్లలు.అందివచ్చిన అవకాశం అనుకుంటున్నారో ఏమో గానీ ప్రయాణీకుల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తున్నారు.ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.దాంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. తగు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సమ్మె కాస్తా కొందరికి కాసుల పంటగా తయారైంది. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ పెద్దలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సమ్మె కారణంగా రోజువారీ వేతనాలతో టెంపరరీ డ్యూటీలు చేస్తున్న కండక్టర్లు కొందరు చేతివాటం చూపుతున్నారని వారు తెలియజేశారు.టికెట్లు ఇచ్చే యంత్రాలు లేకపోవడంతో ఛార్జీలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. దాంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొన్నిచోట్ల గొడవలకు కూడా దారి తీసిన సందర్భాలున్నాయి.

ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సుల్లో జరుగుతున్న ఈ అడ్డగోలు దోపిడీతో ప్రజల నుంచి అసహనం రావడం . ఆ క్రమంలో ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏకంగా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. దాంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. అదలావుంటే సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతుండటంతో తాత్కాలిక సిబ్బంది విధులను పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.అసలు ఈ తెలంగాణాకి ఏమైంది.ఎందుకు ఈ ధర్నాలు ఇబ్బందులు అని జనమంతా కూడా తీవ్ర ఆందోనలలో పడ్డారు.చూద్దాం కే.సీ.ఆర్ సాబ్ ఎస్తడో ఏమో...

 

మరింత సమాచారం తెలుసుకోండి: