దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి.  గుజరాత్ రాష్ట్రం ఇప్పుడు అన్ని రంగాల్లో ముందు ఉన్నది.  గుజరాత్ కు ముఖ్యమంత్రిగా మోడీ మూడుసార్లు పనిచేశారు.  మూడు సార్లు విజయం సాధించారు.  మోడీ హయాంలోనే అభివృద్ధి జరిగింది.  దేశంలో అత్యధిక ధనవంతమైన రాష్ట్రాల్లో కూడా గుజరాత్ కూడా ఒకటిగా మారింది.  సూరత్, జునాగఢ్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉన్నది.  ఇలా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిన గుజరాత్ ఇప్పుడు కూడా అదే రేంజ్ లో పరుగులు తీస్తున్నది.  


గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ, 2014లో దేశానికీ ప్రధాని అయ్యారు.  అప్పటి నుంచి దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది.  ఇక ఇదిలా ఉంటె, దసరా వచ్చింది అంటే, దేశంలో ఉత్సవాలు జరిగే విధానం మాములుగా ఉండదు.  గుజరాత్ లో దసరాను భారీ ఎత్తున నిర్వహిస్తారు.  ఉత్సవాల సమయంలో మహిళలు గాబ్రా ఆడటం పరిపాటి.  గాబ్రా నృత్యం గుజరాత్ కు పెట్టింది పేరు.  దీంతో పాటు దాండియా కూడా ఆడుతుంటారు.  


ఇదిలా ఉంటె, ఇటీవల గుజరాత్ లో జునాగఢ్ లోని షీల్ అనే గ్రామంలో దసరా సందర్భంగా గాబ్రా డ్యాన్స్ చేశారు.  ఈ దసరా రోజున ఆ గ్రామంలో గాబ్రా డ్యాన్స్ చేశారు.  ఈ గాబ్రా డ్యాన్స్ లో ముగ్గురు మహిళలు పాల్గొన్నారు. ముగ్గురు మహిళలు ఒక చేత్తో కోబ్రాను పట్టుకొని ఆడిస్తూ.. మరో చేత్తో కత్తి పట్టుకొని డ్యాన్స్ చేశారు.  కాగా, అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  


ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఇలా వైరల్ గా మారడంతో... అధికారులు స్పందించారు.  గాబ్రా డ్యాన్స్ చేస్తూ.. చేతిలో కోబ్రా పట్టుకున్న ముగ్గురు మహిళలపై కేసులు పెట్టారు.  చట్టం ప్రకారం వన్యప్రాణులను హింసించడం నేరం...ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.  దీంతో ఆ ప్రోగ్రాం ను అరెంజ్ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఈ నృత్యం కోసం పాములను సప్లై చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: