ఎన్ సిసి ద్వారా క్రమశిక్షణ, మానసిక వికాసం, విద్యార్థులలో శరీర దృఢత్వం, నైపుణ్యం అభివృద్ధి, తదితర అంశాలను పెంపొందించుకోవచ్చని కాకినాడ గ్రూప్ కమాండర్  కల్నల్ కెవి శ్రీనివాసరావు తెలిపారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం విద్యార్థుల్లో ఉన్నత ప్రమాణాలు పొందడానికి ఎన్ సిసి ఒక మార్గదర్శకమని  కల్నల్ రావు అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 22 వతేదీ వరకు కమాండర్ కల్నల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్ సి సి స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతున్న ఎన్ సిసి క్యాంపును ఆదివారం కమాండర్ కల్నల్ శ్రీనివాసరావు సందర్శించారు.



అనంతరం ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఈ నెల 12 నుండి 22 వ తేదీ వరకూ ఎన్ సిసి స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపును నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుండి 300 మంది ఎన్ సిసి క్యాడెట్లు మరియు 12 మంది అసోసియేట్ ఎన్ సిసి అధికారులు ఈ క్యాంపుకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 180 బాలురు,120 మంది విన్ గర్ల్స్ పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు ఎన్ సిసి లో కూడా ప్రతిభను చూపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ క్యాంపులు నిర్వహించి వారిని ఉత్తేజపరుస్తున్నాయని అన్నారు. ఎన్ సిసి ద్వారా క్రమశిక్షణ, మానసిక వికాసం, విద్యార్థులలో శరీర దృఢత్వం, నైపుణ్యం అభివృద్ధి, తదితర అంశాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు.




అంతేకాకుండా ఈ క్యాంపులో ప్రతీరోజు యోగా,వ్యాయామం,సాంస్కృతిక కార్యక్రమాలు,పర్యాటక ప్రాంతాల సందర్శన,సమాజానికి ఉపయోగపడే సేవా సంబంధమైన సమాచారం,వ్యాసరచన, వ్యక్తృత్వం, వ్యక్తిత్వ పోటీలతో పాటు, గ్రూప్ సంభాషణలు, రాష్ట్రాల యొక్క నైసర్గిక స్వరూపాల అంశాలపై చర్చాగోష్ఠి, ఫిజికల్ ట్రైనింగ్,మ్యాప్ రీడింగ్,వెపన్స్ ట్రైనింగ్,స్వచ్ఛ భారత్,అవగాహన ర్యాలీలు, మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంపు కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ సింగ్ మరియు ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ బి.లీలాధర్ పాల్గొన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: