చంద్రబాబునాయుడు బహిరంగంగా చెంపలేసుకున్నారు. అవును తన రెండు రోజుల విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఈ ఘటన జరిగింది. నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బిజెపితో పొత్తులు తెగతెంపులు చేసుకోవటంలో తప్పు చేశానని బహిరంగంగా అంగీకరించారు. మామూలుగా తాను చేసే తప్పులకు పార్టీ మూల్యం చెల్లించినా చంద్రబాబు మాత్రం తప్పు ఎన్నడూ ఒప్పుకున్నది లేదు.

  

చంద్రబాబు క్యారెక్టర్ ఏలాంటిదంటే   నష్టం జరిగితే ఎదుటి వాళ్ళు కారణమని ఏదైనా ప్లస్ అయితే క్రెడిట్ అంతా తన ఖాతాలోను వేసుకునే రకం.  మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ప్రజలను తప్పుపట్టారు లేకపోతే జగన్మోహన్ రెడ్డినే తప్పు పట్టారు కానీ తన పరిపాలన అధ్వాన్నంగా ఉండటం వల్లే ఓడిపోయినట్లు మాత్రం అంగీకరించలేదు.

 

అలాంటి చంద్రబాబు మొత్తానికి బిజెపితో పొత్తు తెంచుకోవటం వల్లే నష్టం జరిగిందని పరోక్షంగా అయినా తన తప్పును ఒప్పుకుని చెంపలేసుకున్నట్లైంది. ఇంతకీ తన తప్పును చంద్రబాబు బహిరంగంగా ఎందుకు ఒప్పుకున్నట్లు ? ఎందుకంటే మళ్ళీ బిజెపికి దగ్గరవ్వటానికే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

అటు నరేంద్రమోడిని నోటికొచ్చినట్లు తిట్టి ఇటు జగన్ ను నానా రకాలుగా శాపనార్ధాలు పెట్టినా మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు  జనాలు గూబగుయ్యిమనిపించారు. దాంతో భవిష్యత్తు అర్ధమై బొమ్మ కనిపించిటం మొదలైంది. జగన్ తో ఎలాగూ సయోధ్య సాధ్యం కాదు. అందుకనే మెల్లిగా మోడికి లైన్ కలపటం మొదలుపెట్టారు.

 

ఇందులో భాగంగానే తన పార్టీలోని నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపారు. వాళ్ళల్లో సుజనా లాంటి వాళ్ళు చంద్రబాబుకు అనుకూలంగా వేదికను ఏర్పాటు చేయాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు లేదు. అందుకనే ఇక లాభం లేదనుకుని బహిరంగంగా తన తప్పును అంగీకరించాల్సొచ్చింది. సరే ఇంత జరిగినా చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా మొత్తానికి మోడిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు మాత్రం అర్ధమైపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: