తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చి స్టార్ స్టేటస్ పొందిన హీరో అల్లు అర్జున్. మెగా హీరోగా, మెగా ఫాన్స్ అండదండలతో స్టైలిష్ స్టార్ గా ఎదిగి సొంతంగా ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నాడు. అయితే సూపర్ స్టార్ డంతో పాటు ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా ఉంటూంటాడు బన్నీ. 

 

 

 

రీసెంట్ గా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఓ పోస్టర్ వెలిసింది. 'తెలుగు సినిమా ప్రేక్షకులు ఇతనిని హీరోగా పోషిస్తున్నారు. కానీ.. ఇతను మాత్రం తెలుగు సినీ కార్మికుల పొట్ట కొడుతున్నాడు.. ఎందుకు?' అని బ్యానర్ వెలిసింది. ఈ బ్యానర్ ను ఎవరు రాయించారో, ఎవరు కట్టారో తెలీదు. కానీ.. 'తెలుగు సినీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి' అని రాసి ఉంది. మరి బన్నీ ఎవరికి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశాడనేది తెలియాల్సి ఉంది. ప్రతి తెలుగు సినిమాకి నటుల పరంగా, టెక్నీషియన్ల పరంగా పరభాషా వ్యక్తులు పని చేస్తున్నారు. ఇందులో ఏ తెలుగు హీరో మినహాయింపు కాదు. మరి.. కేవలం బన్నీపైనే సినీ కార్మికులు బ్యానర్ కట్టడానికి కారణం తెలీటం లేదు.

 

 

 

బన్నీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. అన్ని వివాదాలూ ఉన్నాయి. గతంలో విజయవాడలో జరిగిన సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు 'చెప్పను బ్రదర్..' అంటూ సంచలనానికి తెర తీశాడు. అప్పటినుంచి పవన్ ఫ్యాన్స్.. బన్నీపై ఓ యుద్ధమే ప్రకటించారు. ఇటీవల సైరా సినిమా ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా తన కొత్త సినిమా పాట ప్రమోట్ చేయడంపై కూడా విమర్శలొచ్చాయి. మరి.. ఈ బ్యానర్ లో పేర్కొన్న విమర్శలకు బన్నీ నుంచి ఏం సమాధానం వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: