రోజా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్ళింది.  రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున మొదట బరిలో దిగినా కొన్ని కారణాల వలన ఆమెను సొంతపార్టీ వ్యక్తులే ఓడించారు.  ఫలితంగా ఆమె ఓడిపోయింది.  ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుదామని అనుకున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు.  


 ఆ తరువాత జగన్ పెట్టిన వైకాపా పార్టీలో జాయిన్ అయ్యింది.  అప్పటి నుంచి జగన్ పార్టీలోనే ఉన్నది రోజా.  2014 ఎన్నికల్లో రోజా విజయం సాధించింది.  మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.  అలా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రోజాను కొన్ని రోజుల తరువాత అసెంబ్లీ నుంచి బహిష్కరించారు.  తెలుగుదేశం పార్టీపై ఆమె చేసిన ఆరోపణలే ప్రధాన కారణం.  


ఆ తరువాత 2019 ఎన్నికల్లో సైతం రోజా భారీ విజయం సాధించింది.  వైకాపా అధికారంలోకి రావడంతో ఆమె రెండోసారి అసెంబ్లీలోకి అడుగుపెటింది.  అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రోజా తెలుగుదేశం పార్టీని ఓ అట ఆడుతుంది.  ఆమెకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు.  కానీ, రోజాకు మంత్రి పదవి దక్కలేదు.  దీంతో రోజాకు ఏపీఐసిసి అధ్యక్షురాలిగా నియమించారు.  


ఇది నామినేటెడ్ పదవి అయినప్పటికీ మంచి పదవి కావడంతో ఆమె కాదనలేదు.  ఈ పదవిలో ఉన్నందుకు రోజాకు ప్రభుత్వం నెలకు రూ. 3.8 లక్షల జీతభత్యాలు చెల్లిస్తుంది.  ఇందులో రూ. 2 లక్షలు జీతం, వాహన అలవెన్స్ రూ. 60వేలు, ఇంటి రెంట్ కింద మరో రూ. 50వేలు, ఫోను బిల్లు రెండు వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతాల కింద రూ. 70వేలు చెల్లిస్తుంది.  ఇవి కాకుండా ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు నెలకు రూ. 1,25,000/- జీతం వస్తుంది.  ఇక జబర్దస్త్ కామెడీ షోలో జడ్జి గా చేస్తున్న రోజాకు ఎపిసోడ్ కు రెండు లక్షలు అందుకుంటోంది.  మొత్తం మీద రోజా నెలకు బాగానే సంపాదిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: