మహారాష్ట్ర, హర్యానాకు ఈనెల 21 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని బట్టి ఆ పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది.  కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అప్ డేటెడ్ గా ఉండటం లేదు. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకొని వాటిని ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటేనే పార్టీ గెలుపుకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది.  


పాత చింతకాయ పచ్చడిలా పాత వాటినే పట్టుకొని పరుగులు తీస్తుంటే.. ఉపయోగం ఏముంటుంది.. ఏమి ఉండదు.  శూన్యం తప్పించి.  ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అలానే చేస్తున్నాడు.  అరిగిపోయిన టేప్ రికార్డర్ మాదిరిగా, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో తిరిగి రాఫెల్ వివాదాన్ని నెత్తికెత్తుకొని ప్రచారం చేయబోతున్నారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాఫెల్ ఒక కారణం అయ్యింది.  


పూల్వమా దాడి, సర్జికల్ స్ట్రైక్స్ ను బేస్ చేసుకోని ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ మాత్రం రాఫెల్ డీల్ ను నెత్తికెత్తుకొని ప్రచారం చేసింది.  ఫలితం లేకుండా పోయింది.  ఇప్పుడు కూడా అదే జరిగేలా కనిపిస్తోంది. రాఫెల్ మొదటి ఫ్లైట్ ను ఇండియా డెలివరీ తీసుకుంది.  మొదటి విడతగా కొన్ని విమానాలు ఇండియాకు రాబోతున్నాయి.  మొత్తం 36 విమానాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  దీనికోసం 58వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది.  


అయితే, కాంగ్రెస్ పార్టీ హయాంలో 150 విమానాలు కొనుగోలు చేయడానికి 54వేలకోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేందుకు సిద్ధమైతే, 58వేలకోట్లకు 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేయడం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ వాదన.  అయితే, రాఫెల్ లో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వినియోగించి వీటిని తయారు చేయించారు. కొత్తగా తయారు చేసిన ఒక్కో రాఫెల్ విమానం 10 విమానాలకు సమానం.  అయితే, రాహుల్ గాంధీ రాఫెల్ అంశాన్ని తీసుకొని ప్రచారమా చేసుకుంటూ పొతే.. దానివలన ఎంతవరకు లాభం ఉంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: