ముఖ్యమంత్రిగా జగన్ నాలుగున్నర నెలల పాలనలో షాక్ ట్రీట్మెంట్స్ అన్నీ  ఆయనే ఇస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు డ్రీమ్  బిల్డింగ్ ప్రజావేదిక కూల్చేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక అదే వరసలో బాబు ఉంటున్న అక్రమ నివాసం విషయంలో కూడా వైసీపీ సర్కార్ కన్ను ఉందని అంటున్నారు. ఇపుడు టీడీపీ ఆఫీస్ మీద కూడా టార్గెట్  చేశారు. ఇలా ప్రతిపక్ష టీడీపీతో చెడుగుడు ఆడుతుంటున్న జగన్ కి  ఒక విషయంలో మాత్రం  షాక్ తగిలేలా కనిపిస్తోంది.


ఏపీకి జీవనాడి, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో 2022 నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. తన తండ్రి వైఎస్సార్ హయాంలో మొదలైన పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఆయనకే అంకితం ఇవ్వాలన్నది కూడా జగన్ ఆశయంగా ఉంది. అయితే పోలవరం విషయంలో నవయుగ కాంట్రక్టర్ ని పక్కన పెట్టి మేఘా సంస్థకు రివర్స్ టెండరింగ్ ద్వారా కట్టబెట్టిన జగన్ ఇపుడు జోరు మీద ఉన్నారు.


అయితే జగన్ జోరుకు అడ్డుకట్ట వేయడానికి బీజేపీ రెడీ అవుతోందట. దానికి టీడీపీ నుంచి బీజేపీలోకి మారిన బాబు ఒకనాటి ముఖ్య అనుచరుడు సుజనా చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ ని కలసిన ఏపీ బ్రుందంలో సుజనా ఉండడం విశేషం. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో కలసిన ఈ టీం పోలవరం పై నివేదికను కేంద్ర మంత్రికి అందించింది.


పోలవరం విషయంలో గత నాలుగు నెలలుగా ఎటువంటి అభివ్రుధ్ధి జరగలెదని కూడా తెలియచేసింది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలవరాన్ని కేంద్రమే తన చేతుల్లొకి  తీసుకుని నిర్మాణం చేపట్టాలని కూడా ఏపీ బీజేపీ నేతలు కోరుతున్నారు. దీనివల్ల ఏపీలో రాజకీయంగా పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని,  జనాలకు చెప్పుకోవడానికి కూడా గట్టిగా ఒకటి  ఉంటుందని అంటున్నారు. జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరం విషయంలో కేంద్రం నిధులు ఖర్చు చేస్తున్నందువల్ల ఏపీ సర్కార్ ప్రమేయం లేకుండా చేయాలని కూడా అంటున్నారు.


  దీని మీద షెకావత్ కామెంట్స్ చూసినా కూడా కేంద్రం ఏపీ సర్కార్ కి షాక్ ఇవ్వబోతోందని అర్ధమవుతోంది. ఏపీ సర్కార్ పోలవరం విషయంలో ఆటంకాలు ఏర్పరుస్తోందని కేంద్ర మంత్రి కామెంట్స్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి పోలవరం కేంద్రం తీసుకుంటే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: