చంద్రబాబునాయుడు లక్ష్యంగా చేసుకునే ఐటి శాఖ ఉన్నతాధికారులు దాడులు చేశారా ? అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. మెఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ పై ఇటీవలే ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. మెఘా కంపెనీ ఛైర్మన్ కృష్ణారెడ్డితో చంద్రబాబునాయుడుకున్న సాన్నిహితం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకూ అధికారంలో ఉన్నపుడు కానీ అంతకుముందు సిఎంగా ఉన్నపుడు కానీ మెఘా కంపెనీని చంద్రబాబు బాగానే పెంచిపోషించాడు.

 

గడచిన ఐదేళ్ళను తీసుకున్న విభజిత ఏపిలో పట్టిసీమ ప్రాజెక్టు, కొడవీటి వాగుపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఒలెక్ట్రా ఎలక్ట్రానిక్ బస్సుల లీజు/ కొనుగోలు కాంట్రాక్టు లాంటవన్నీ మెఘా కంపెనీకే చంద్రబాబు కట్టబెట్టాడు. అంటే చంద్రబాబు ఎప్పుడు సిఎంగా ఉన్నా మెఘాకే తొలి ప్రాధాన్యత. కాబట్టి మెఘా కంపెనీ నుండి చంద్రబాబు బాగానే లబ్ది పొందినట్లు అనేక ఆరోపణలున్నాయి.

 

ఈ ఆరోపణలకు తగిన ఆధారాలను కూడా ఐటి శాఖ ఉన్నతాధికారులు సేకరించినట్లు సమాచారం. ఇ విషయాలు తెలిసే టిడిపిలో నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి చంద్రబాబే పంపినట్లు సమాచారం. ఫిరాయించిన వారి పనేంటంటే కేంద్ర దర్యాప్తు సంస్ధల నుండి చంద్రబాబుకు ఎటువంటి ముప్పు రాకుండా చూడటమే వారి పనట.

 

ఇందులో భాగంగానే ఎల్లోమీడియా అధిపతి కూడా కీలకమైన కేంద్రమంత్రిని కలిసి చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడినా పని కాలేదని ప్రచారం జరుగుతోంది. బిజెపి ఏపి ఇన్చార్జి సునీల్ థియోధర్ కూడా చంద్రబాబు తొందరలో జైలుకు వెళ్ళటం ఖాయమని పదే పదే చెప్పటంలో అర్ధం ఇదేనని సమాచారం. ఐటి దాడుల్లో చంద్రబాబును ఫిక్స్ చేయటమే టార్గెట్ గా అమిత్ షా  ఉచ్చు బిగుస్తున్నారట. ఆ విషయం తెలిసే బిజెపితో తెగ తెంపులు చేసుకుని తప్పు చేశానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటనలో పశ్చాత్తాపం వ్యక్తం చేయటమట. అంటే ఎక్కడో స్విచ్చు నొక్కితే మరెక్కడో ఉన్న బల్బు వెలగటమంటే ఇదేనేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: