జనసేన అధినేత పవన్ కల్యాన్ కు ఓ గండం పొంచి ఉందని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇక్కడ గండమంటే ప్రాణహాని ఉందని కాదు అర్ధం. పార్టీలోనే ఉన్న కోటరి నుండి ముప్పు ఉందని మాత్రం అర్ధం. పవన్ జనసేన పెట్టాలని నిర్ణయించుకున్నప్పటి నుండి ఓ ఐదారుగురు సభ్యులతో ఓ కోటరి ఏర్పడింది. అంటే వీళ్ళందరూ పవన్ కు రాజకీయ వాసనలు తగలక ముందునుండే పరిచటం ఉందట.

 

కాబట్టి జనసేన పెట్టిన మరుక్షణం నుండి వీళ్ళంతా పనవ్ చుట్టూ ఓ దడికట్టేశారు. అంటే జనసేనలో చేరిన వాళ్ళను, చేరాలని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నేరుగా పవన్ తో మాట్లాడేందుకు అవకాశం లేకుండా చేశారు. పవన్ కు ఇతర నేతలకు మధ్య ఈ కోటరీనే గట్టిగా పెద్ద గోడ కట్టేసింది. పవన్ అయినా నేతలైనా ముందు కోటరీతోనే మాట్లాడాలి. కోటరీలోని వ్యక్తులు నేతల విషయంలో సానుకూలంగా ఉంటే పవన్ తో భేటికి  అవకాశం. లేకపోతే వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెనక్కుపోవాల్సిందే.

 

పార్టీకి ఈమధ్యనే రాజీనామా చేసిన కొవ్వూరులో పోటి చేసి ఓడిపోయిన పసుపులేటి రామారావు బహిరంగంగా చేసిన ఆరోపణలివి. తన రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడుతూ పవన్ తో పాటు కోటరీపైన కూడా రామారావు చాలా ఆరోపణలే చేశారు. పసుపులేటి చేసిన ఆరోపణలు దాదాపు వాస్తవమే అని పార్టీలో ఉన్న నేతలే కాకుండా రాజీనామా చేసిన నేతలు కూడా బహాటంగానే చెబుతున్నారు.

 

రామారావు లెక్క ప్రకారం పవన్ ను చెడగొట్టింది కోటరీలోని వ్యక్తులేనట. కోటరీలోని వ్యక్తులెవరో జనసామాన్యానికి ఎవరికీ తెలీదు. వీళ్ళేమీ రాజకీయ నేతలు కాదు కాబట్టి కనీసం వాళ్ళుంటున్న వీధిలో కూడా అందరికీ తెలీదంటున్నారు రామారావు. మరి ఇలాంటి కోటరిని చుట్టూ పెట్టుకుని పవన్ రాజకీయాలు ఏం చేయగలరు ? 

 

పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు పవన్ దృష్టిలో ఉన్నా కోటరినీ కంట్రోల్ చేయలేకపోతున్నారట. అందుకనే జనసేన బలోపేతంపై పవన్ కు కూడా దృష్టి తగ్గించి మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. కాబట్టి పవన్ కల్యాణ్ ను కోటరి గండం రాజకీయంగా ముంచేస్తోందని అంగీకరించక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: