తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులందరూ సమ్మె చేపట్టడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.అయితే  ప్రభుత్వం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి అద్దె  ప్రైవేటు బస్సులు నడిపేందుకు ఆలోచన చేసింది . ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా అడుగులు వేసిన ప్రభుత్వం... ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విజయం సాధించామని రవాణా శాఖ మంత్రి తెలిపారు. తాత్కాలిక కండక్టర్లు డ్రైవర్లు నియమించి అద్దె  ప్రైవేటు బస్సులను నడుపుతుంది  ప్రభుత్వం. అయితే ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు పూర్తిస్థాయిలో ప్రయాణికుల అవసరాలను తీర్చడం లేదు. గంటలకొద్దీ రోడ్లపై పడిగాపులు కాస్తే  తప్ప ఎప్పుడో  కానీ బస్సులు  రాని పరిస్థితి ఏర్పడింది. 

 

 

 

 

 దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్న అద్దె  ప్రైవేటు బస్సుల్లో... ప్రైవేటు వాహనదారుల  లాగా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తిప్పుతున్న బస్సులో వెళ్లిన ప్రయాణికులకు జేబుకు చిల్లు పడక తప్పలేదు. సరే జేబుకు చిల్లు పడిన పర్లేదు ప్రాణాలకు సురక్షితంగా ఉంటుందని ప్రయాణికులు భావించి ప్రభుత్వం తిప్పుతున్న అద్దె ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు . కానీ ప్రస్తుతం ప్రయాణికులకు ఆ బస్సులో కూడా ప్రాణాలకు రక్షణ కరువైంది. అనుభవం తక్కువగా ఉన్న వాళ్ళను  తాత్కాలిక డ్రైవర్లు గా ప్రభుత్వం నియమించడంతో... ప్రమాదాలకు కారణమవుతున్నారు డ్రైవర్లు . 

 

 

 

 

 

 ఇక ప్రభుత్వం తిప్పుతున్న బస్సులో ప్రయాణం చేయాలన్న ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులు. అయితే ఇప్పటికే తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ పలు  ప్రమాదాలకు గురి చేసారు . ఇప్పుడు తాజాగా మరో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న తాత్కాలిక డ్రైవర్ బస్సు తో బీభత్సం సృష్టించాడు. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు 2 ఢీ కొనడంతో... బస్సులో ప్రయాణిస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న తాత్కాలిక డ్రైవర్  బస్సుతో  బీభత్సం సృష్టించడంతో భయంతో పరుగులు తీశారు వాహనదారులు. తాత్కాలిక డ్రైవర్లు తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో నెడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: