తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు మాకు దేవుడని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ప్రముఖ  ఛానల్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో అశ్వత్థామరెడ్డి  మాట్లాడుతూ.. ‘హరీశ్ రావు నాకు మాత్రమే దేవుడు కాదు. ఆర్టీసీ కార్మికుల పాలిట అందరికి దేవుడు అని అన్నారు. గతంలోనూ ఇదే మాట చెప్పాం. ఇప్పుడూకూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. దేవుడు అన్ని సందర్భాల్లోనూ రాడు కదా... సమయం వచ్చినప్పుడు కదులుతాడు. దేవుడిది అదృశ్య హస్తం. అలాగని, మా సమ్మె వెనుక హరీశ్ రావు ఉన్నాడని కాదు అర్ధం. 


ఇక ఆర్టీసీ  సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత హరీశ్ రావుతో మేం ఒక్క సారి కూడా మాట మాట్లాడలేదు.’ అని స్పష్టం తెలియచేసారు. ఈ వ్యవహారంలోకి హరీశ్ రావును తీసుకొని రావద్దు అని  అశ్వత్థామరెడ్డి  విజ్ఞప్తి చేశారు. టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఫిబ్రవరిలోనే హరీశ్ రావు రాజీనామా చేశారని మరో సారి గుర్తు చేశారు. ఆ తర్వాత తమకు ఎవరూ గౌరవాధ్యక్షుడుగా ఎవరు లేరు అని తెలిపారు.


 తమ యూనియన్‌ టీఆర్ఎస్ అనుబంధం అంటూ ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదు అని  అశ్వత్థామరెడ్డి స్పష్టం తెలిపారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో కూడా హరీశ్ రావు నాయకత్వం వహించారని చెప్పారు. ఆ తర్వాత టీఎంయూకి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారే కానీ, టీఆర్ఎస్‌తో తమకు సంబంధం లేదని స్పష్టంగా తెలియచేసారు.


ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు ప్రయత్నం జరుగుతోందని అశ్వత్థామరెడ్డి ఆరోపణలు చేసారు. ఆర్టీసీ పేరిట ఉన్న ఆస్తులను ఇప్పటికే కట్టబెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు, నిబంధనలు రచించారని తెలిపారు. ఇక వరంగల్ నడిబొడ్డున నాలుగు ఎకరాల భూమిని అప్పగించేందుకు, డీజిల్ బంకులకు సంబంధించి టెండర్లు ఖరారైనట్టు కూడా తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు పోతుంది అని తెలిపారు. వారికి సంబంధించిన వ్యక్తులు చొరబడి ఆ తర్వాత మెల్లగా ఆర్టీసీని మూసేస్తారంటూ పరోక్షంగా కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం జరిగింది ఇంటర్వ్యూలో.


మరింత సమాచారం తెలుసుకోండి: