సాధారణంగా మృతదేహాలను ఖననం చేస్తుంటే ఒక్కోసారి లేవడం చూస్తుంటాం..అయితే అది రసాయనిక చర్యల వల్ల ఎముకలు బిగుసుకు పోవడంతో అలా జరుగుతుందని వైద్యులు తెలుపుతుంటారు. తాజాగా ఓ వ్యక్తిని చితిపై పడుకోబెట్టి ఇక నిప్పు అంటించే సమయంలో ఒక్కసారిగా లేవడంతో గ్రామస్థులు గుండె గుభేల్ మంది..కొంత మంది తేరుకొని అసలు విషయం గమనించి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి బ్రతికి ఉన్నాడని గమనించారు.  ఇది తెలిసిన జనం అతడిని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..ఒడిశాలోని గంజాం జిల్లా లావుఖాలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన సిమాంచల్ మల్లిక్ (52) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూనే శనివారం మేకలను మేపేందుకు అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే అడవికి వెళ్లిన మల్లిక్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంటి సభ్యలు అడవికి వెళ్లి వెతకడం ప్రారంభించారు.  ఓ చోట పడి ఉన్న మల్లిక్‌ను గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతడిని లేపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చలనం లేకపోవడంతో చనిపోయాడని భావించారు.

దాంతో మల్లిక్ ఇక చనిపోయాడని భావించి అతన్ని అంతిమ సంస్కారం చేయడానికి సిద్దమయ్యారు. అనంతరం సాయంత్రం శ్మశానానికి తీసుకెళ్లి చితి పేర్చారు..ఇక చితికి నిప్పు పెట్టే లోపు ఉన్నట్టుండి మల్లిక్ లేవడంతో అక్కడ ఉన్నవారంతా ఖంగు తిన్నారు. మల్లిక్ శ్వాస తీసుకుంటున్న అతడిని గమనించిన కొందరు వెంటనే వెళ్లి చితిపై నుంచి కిందకి దింపి సపర్యలు చేయడంతో లేచి కూర్చున్నాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన జనం అతడిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: