పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతులెత్తేసినట్లే కనబడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వివిధ ప్యాకేజీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు ప్యాకేజీలకు పిలిచిన రివర్స్ టెండర్లలో సుమారు రూ. 830 కోట్ల వరకూ ప్రజాధనం ఆదా అయ్యింది.

 

మొదటి రెండు ప్యాకేజీల్లో రివర్స్ టెండర్ విధానం సక్సెస్ అవటంతో మరిన్ని ప్యాకేజీలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే  రివర్స్ టెండర్ ప్యాకేజీల విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని షెకావత్ చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

మొదటేమో రివర్స్ టెండర్లను కేంద్రం వ్యతిరేకించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటి కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం వ్యతిరేకించినా, అథారిటి వ్యతిరేకించినా కేంద్రమంత్రికి తెలీకుండా అయితే ఏమీ జరగదు. అదే సమయంలో కేంద్రం జలశక్తి శాఖ ఉన్నతాధికారులకు కూడా రివర్స్ టెండర్ విషయం పూర్తిగా తెలుసు.

 

కాబట్టి రివర్స్ టెండర్ల వ్యవహారం తనకు తెలీదని ఇపుడు మంత్రి చెప్పటంలో అర్ధంలేదు. కాకపోతే కేంద్రం వద్దని చెప్పిన తర్వాత కూడా జగన్ ముందుకెళ్ళటం, సుమారు రూ. 830 కోట్లు మిగిలినట్లు నిరూపించటాన్ని కేంద్రమంత్రి తట్టుకోలేకపోతున్నారేమో తెలీదు. ఎందుకంటే కేంద్రంలోని కొందరు మంత్రులు తెరవెనుక నుండి చంద్రబాబునాయుడు చెప్పినట్లు ఆడుతున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఇందులో భాగంగానే షెకావత్ తాజా ప్రకటన కూడా ఉన్నట్లుంది. అయితే రాష్ట్రం నుండి కేంద్రమంత్రిని కలిసిన బిజెపి బృందానికి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలీదా ? రివర్స్ టెండర్లలో వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిన విషయం తెలిసి కూడా ఎందుకు కేంద్రమంత్రికి వాస్తవాలు చెప్పటం లేదు ?

 

రివర్స్ టెండర్ విధానానికి మద్దతుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచినట్లవుతుందన్న ఏకైక రాజకీయ కారణాలతోనే రివర్స్ టెండర్ ను వ్యతిరేకిస్తున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే రివర్స్ పై కేంద్రమంత్రి కూడా చేతులెత్తేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: