ప్రస్తుత అందరి సమస్య ఒక్కటే సమ్మె..సమ్మె ఇప్పుడీ భీభత్సానికి మరోక్కరు అసువులు బాసారు.ఆర్టీసీ కార్మికులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వ అణచివేతకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు సిద్ధమవుతున్నారు. నిన్నటికి నిన్న డి.ఆర్.డి.ఓ అపోలో ఆసుపత్రిలో ఖమ్మంలో ఆత్మహత్య కు పాల్పడిన శ్రీనివాస్ రెడ్డి కన్నుమూయగా, హైదరాబాదులో కండక్టర్ సురేందర్ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక నర్సంపేటలో మరో డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేయబోయారు.ఆర్టీసీ కార్మికులు మనోవేదనతో ప్రాణత్యాగాలకు సిద్ధమవుతున్న పట్టింపులేని ప్రభుత్వ వైఖరి అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఏపీలో చేసిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పది రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న, పలు రూపాల్లో తమ ఆవేదన ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తుంది. ఆర్టీసీ సమ్మె లో ఆవేదన భరిత ఘట్టాలు ఎన్నో చోటు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంతకింతకూ ఉద‌్రిక్తంగా మారుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి రోజు కూడా గడవకముందే హైదరాబాద్‌లో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్‌ కుల్సుంపురాలో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాణిగంజ్‌ డిపోలో సురేందర్‌గౌడ్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు.ఇలా ఒక్కో మరణం పెరుగుతున్నా కూడా చలించని హిట్లర్ కే.సీ.ఆర్ గారు ఇంకా ఎప్పుడు ఈ సమస్యను తీర్చనున్నారో ఏంటో ఏం అర్థం కావడం లేదు అంటూ జనం గగ్గోలు పెట్టసాగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: