ఆయనకు మంచి పేరుంది. బీజేపీ సానుభూతిపరుడు అనే ముద్రా ఉంది. అన్నింటికీ మించి- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు భర్త. అలాంటి వ్యక్తి నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకోవడం మాత్రం భారత్లో సంచలనం సృష్టిస్తోంది. పైగా కాంగ్రెస్ సీనియర్ నేతలను చూసి మోడీ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ వ్యాఖ్యానించడం బీజేపీ నేతల కు అరికాలి మంట శిరస్సుకు చేర్చింది. పరకాల ప్రభాకర్ అంత డేరింగ్ గా విమర్శించానికి ప్రధాన కారణం. దేశ ఆర్థిక రంగం అదీ ఆయన పత్ని నిర్మల ఆదీనంలో ఉన్న శాఖ. 
Image result for PV Manmohan
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యంపై తన అభిప్రాయాన్ని పరకాల ప్రభాకర్‌ వెల్లడించారు. ఆయన అభిప్రాయాన్ని ఒక జాతీయ దినపత్రిక ప్రచురించింది. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. 

పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ విధానాలే బాగున్నాయి. పీవీ-మన్మోహన్‌ ఆర్థిక విధానాలను (ఆర్ధికరంగ సరళీకరణ) బీజేపీ ప్రభుత్వం అనుసరించాలి. జవహర్లాల్ నెహౄ ఆర్థిక విధానాలను బీజేపీ విమర్శించడాన్ని కూడా పరకాల ప్రభాకర్ తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్థిక విమర్శగా లేదని రాజకీయదాడిగానే మిగిలిపోయిందని, ఆ విషయాన్ని బీజేపీ ఇంకా గుర్తించడం లేదని ఆయన పేర్కొన్నారు. 

ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళ్తుందని ప్రభాకర్‌ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడం లేదని, దేశంలో ఒక రంగం తర్వాత మరో రంగానికి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆర్థికమాంద్యంవల్ల నిరుద్యోగిత  45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా, వివిధ రంగాల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని పరకాల ప్రభాకర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్ కు చెందిన ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ను బీజేపీ అధిష్ఠానం అత్యున్నత స్థాయిలో గౌరవిస్తోందని, పార్టీ రాజకీయ కార్యకలాపాలకు ఆయనను ఐకన్ గా చెప్పుకొచ్చారు. రాజకీయ అవసరాల కోసం వల్లబ్ భాయ్ పటేల్ పేరును పార్టీ ఎలా ఉపయోగించుకుంటోందో, అలాగే ఆర్థిక విధానాల కోసం మన్మోహన్ సింగ్ ను కూడా అదే తరహాలో గౌరవించాల్సిన అవసరం ఉందని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Image result for sardar patel manmohan

మరింత సమాచారం తెలుసుకోండి: