ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తానని ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని ప్రస్తుత సీఎం జగన్ నెరవేర్చుకుంటున్న సంగతి అందరికి  తెలిసిందే కదా. ఈ క్రమంలోనే ఆయన అధికారం చేపట్టిన నాలుగు మాసాల్లోనే 2 లక్షల మంది గ్రామ వలంటీర్లు వార్డు వలంటీర్ల ఉద్యోగాలను సృష్టించి.. భర్తీకి  అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కొత్తగా గ్రామ/వార్డు సచివాలయంను ఏర్పాటు చేసి.. వాటిలోనూ 1.4 లక్షల మంది కార్యదర్శులను నియమించే పనిలో విజయం సాధించింది అనే చెప్పాలి జగన్ సర్కార్.


ఇదే క్రమంలో  ఏదో హామీ ఇచ్చాం కదా అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారులే! అని జగన్ అనుకోవడంలేదు అసలు. తాను ఇచ్చిన మాటలకు కట్టుబడ్డారు. ఖచ్చితంగా ఆగస్టు 15 నాటికి వలంటీర్లు రంగంలోకి రావాలని - అదేసమయంలో అక్టోబరు 2 నాటికి సచివాలయాల్లో ఉద్యోగులు ఉండాలని ఒక సమయాన్ని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ముందుకు పోయింది జగన్ సర్కార్.


పోస్టులకు తగట్టు నియామకాలను వడివడిగా చేపట్టారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించింది అని అందరికి అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు మరోసారి గ్రామ / వార్డు వలంటీర్లకు మరోసారి సరి కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. వలంటీర్ గా ఎంపికయినా చేరని - వివిధ కారణాలతో భర్తీ కానీ 9648 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి వివరాలు తెలియచేస్తున్నారు.


ఇక గ్రామాల్లో 50 కుటుంబాలకు  వాలంటీర్ చొప్పున 194592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 184944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం ఈ నెలాఖరులోగా ప్రకటన చేసి డిసెంబర్ లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు అనుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే జిల్లాల వారీగా  అభ్యర్థులకు ప్రకటన వస్తుంది. ఈ పరిణామంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు కచ్చితంగా పండగ అంటున్నారు అందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: