రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె నేటితో 10 రోజులు పూర్తి చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మో ఆపమని, మాకు న్యాయం చెయ్యాలని లేకపోతే ఇంకా ఉదృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు అంటుంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్తుంది. 


అయితే ప్రయాణికులకు ఇబ్బందులు ఉండకూడదు ఆర్టీసీకి తాత్కాలిక డ్రైవర్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నది పక్కన పెడితే.. ఈ తాత్కాలిక డ్రైవర్లకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి ప్రజల ప్రాణాలను తీస్తుంది. 


తాత్కాలిక డ్రైవర్లు నియామకం అయినా మొదటి రోజు నుంచి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తాత్కాలిక డ్రైవర్లు ఒకరు ఉన్న టికెట్ ఛార్జి కంటే ఎక్కువ ఛార్జి వేస్తే.. ఇంకో డ్రైవర్ ఫోన్ లో వీడియోలు చూస్తూ డ్రైవ్ చేస్తాడు. ఇంకో తాత్కాలిక డ్రైవర్ అయితే ఈరోజు ఏకంగా మద్యం సేవించి బస్సు నడిపి బస్సు ప్రయాణికులను అష్టకష్టాలకు గురిచేశాడు. 


ఇంకా తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా మరో 10 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులు సంగారెడ్డి జిల్లా పులకల్ మండలం చోటాపూర్‌ గ్రామస్తులుగా గుర్తించారు. హైదరాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ జిల్లా బిచ్కుంద నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


కాగా క్షతగాత్రులను సమీపంలోని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా బుస్స్ నడిపిన తాత్కాలిక డ్రైవర్ కు ఎలాంటి అనుభవం లేదని అందుకే ఈ ప్రమాదం జరిగిందని బస్సు ప్రయాణికులు చెప్తున్నారు. కాగా బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: