ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న టీడీపీని, సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి. జగన్ వరుసగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ టీడీపీని కోలుకోకుండా చేస్తున్నారు. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయంతో టీడీపీకి మరో దెబ్బ పడింది. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 50 గ్రామ పంచాయితీలని మున్సిపాలిటీలుగా చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ముఖ్యంగా టీడీపీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో 5 గ్రామ పంచాయితీలని మున్సిపాలిటీలుగా మార్చనున్నారు. ఆ ఐదు మున్సిపాలిటీలు వచ్చి..అవనిగడ్డ, పామర్రు, కైకలూరు, మైలవరం, విసన్నపేట. అయితే ఈ ఐదు మున్సిపాలిటీలకు చెందిన ఆయా నియోజకవర్గాల్లో మొన్న ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది. అవనిగడ్డలో సింహాద్రి రమేశ్, పామర్రులో కైలా అనిల్ కుమార్, కైకలూరులో డి. నాగేశ్వరరావు, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ లు వైసీపీ తరుపున గెలిచారు.  ఇక విసన్నపేట తిరువూరు నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ వైసీపీ తరుపున రక్షణ నిధి గెలిచారు.


అయితే ఐదు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీ పరిధి గల ప్రాంతాల్లో టీడీపీకి మంచి పట్టుంది. కాబట్టి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలోనే జగన్ జిల్లాలో 5 కొత్త మున్సిపాలిటీలని ఏర్పాటు చేసి, వాటి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి, మున్సిపాలిటీ ఎన్నికల్లో వాటిని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీని గట్టి దెబ్బకొట్టి మళ్ళీ కోలుకోకుండా చేయాలని ప్లాన్ చేశారు.


ఇక అక్కడ ఎలాగో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి పని చేస్తే, తిరుగులేని విజయాలని సొంతం చేసుకోవచ్చు. ఏదేమైనా జగన్ వ్యూహం అదుర్స్ అనే చెప్పాలి.  ఇక కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో టీడీపీకి భ‌విష్య‌త్తులో కూడా చెక్ పెట్టేందుకు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వేసిన ఈ స్కెచ్ మామూలుగా లేద‌నే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: