ఆర్ధిక భారతం ప్రభుత్వం చెపుతున్నంత ప్రశాంతంగా తన గమనాన్ని కొన్సాగిచట్లేదు. గతుకులు గుంతలే కాదు ప్రమాధకర లోయలు పర్వతాలపై నుండి పయనిస్తుంది. ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు పైకి లేస్తుందో చెప్పలేనంతగా పరిస్థితులు నెలకొన్నట్లున్నాయి

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ముసురుకుంటున్న ఆర్థిక మందగమన ప్రభావం భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉండనుందని “అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ” (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు.  అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మందగమనంలోకి జారుతున్న పరిస్థితు లను మనం చూస్తున్నామని ఆమె ఆందోళన చెందారు. 
Image result for countries going face economic turndown
అంటే ప్రపంచ ఆర్థికవృద్ధి 90 శాతం ఈ ఏడాది మందగమనంలోకి జారిపోనుందని వివరించారు. ఇంకా చెప్పాలంటే, వృద్ధి రేటు ఈ దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిని చూడ బోతుందని ఆమె తెలిపారు.  2019, 2020 వరల్డ్‌ ‘ఎకనమిక్‌ అవుట్‌-లుక్‌’ నేడో రేపో విడుదల కానున్న సంధర్భంలో  ఆమె పేర్కొన్న, ఈ అవుట్‌-లుక్‌ లో వృద్ధిరేట్ల అంచనాలకు చాలానే కోత పడే అవకాశం ఉందనీ పిడుగులాంటి వార్త వెలువరించారు. ఏఎ వారమే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశం జరగనుంది. 
Image result for countries going face economic turndown
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐఎంఎఫ్‌ అధినేత్రి ముందస్తు కీలక ప్రసంగం చేశారు. అంతర్జాతీయంగా పలు దేశాల ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, క్లిష్టమైన పరిస్థితి కనిపిస్తోంది.

మొత్తంగా వృద్ధి మందగమనం ఉన్నప్పటికీ, 40 వర్థమాన దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 5%పైనే ఉంది. ఆయా దేశాల్లో 19సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి.  

పలు దేశాలు ఇప్పటికే ఆర్థిక తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆర్థిక స్థిరత్వం పటిష్టత లక్ష్యంగా ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలి.  తక్కువ వడ్డీరేట్ల ఆర్థిక వ్యవస్థల్లో అదనపు నిధలు వ్యయాలకు కొంత అవకాశం ఉంది.  

వ్యవస్థాగత సంస్కరణలతో ఉత్పాదకత పెంపు తద్వారా ఆర్థిక క్రియాశీలత మెరుగుదలకు అవకాశం ఉంది. తద్వారా అధిక వృద్ధి సాధించడం అవసరం. ఇందుకు తగిన మదింపు జరగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: