ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలనని తెర తీస్తున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయం తీసుకొని ఆంధ్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు. సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు.                

                  

ముఖ్యమంత్రి అయినా నాలుగు నెలలలోనే నాలుగు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గ్రామా వాలింటర్లను, గ్రామా సచివాలయ ఉద్యోగాలు అని ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఏపీఎస్ఆర్టీసీని ఆంధ్ర ప్రభుత్వంలోకి విలీనం చెయ్యడం ఇలా సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు సీఎం జగన్. 

                

ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ మరోసారి ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వదిలేకి సిద్దమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. శాఖల వారీగా ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. శాఖల నుంచి పూర్తి సమాచారం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదలకు సిద్దమవుతుంది. దీన్ని బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవుతుందని అనిపిస్తుంది. కాగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుందని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైన ఆంధ్రలో ఉద్యోగాలకు కొదవ లేదు. ఎప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. 

                             

మరింత సమాచారం తెలుసుకోండి: