పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సునామి అందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికలలో పవన్ తన ప్రతిభ కనపరుస్తారేమో అని ఎదురు చూశారు కాని ఒక్కరు తప్ప ఎవ్వరు గెలవలేదు కనీసం పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదు దాంతో ఇప్పుడు ముఖ్యమంత్రి రేసు మాట అటుంచి కనీసం ఎమ్మెల్యేగా గెలిచినా కానీ పవన్‌కళ్యాణ్‌ చేతిలో ఇప్పుడు చాలా పని వుండేది. ఎన్నికలకి ముందు ఎలాగయితే సమస్యలపై ట్వీట్ల యుద్ధం చేసేవాడో ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాడు. అప్పట్లో సినిమాలు చేస్తూ ట్వీట్లు వేసేవాడు. ఇప్పుడు సినిమాలు కూడా చేయడం లేదు. ఖాళీ ఎక్కువ కావడంతో పవన్‌ తిరిగి నటిస్తాడేమో అని ఆశపడే వాళ్లు ఎక్కువయ్యారు. 

నటించాలనే ఇష్టం తనకి లేకపోయినా కానీ టెంప్టింగ్‌ ఆఫర్లతో నిర్మాతలు అతడిని నిత్యం వెంటాడుతున్నారు. ఈ నేపథ్యంలో గట్టిగా వారిని వారించడం మానేసి కథలు వినడం, వాటికి ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం కూడా చేస్తూ వుండడంతో ఏదో ఒక టైమ్‌లో మెత్తబడి సినిమా చేసేస్తాడని మరింత గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సినిమాలు తిరిగి చేయడం వల్ల పవన్‌పై ఒక రెండు, మూడు కామెంట్లు పడతాయేమో కానీ అంతకుమించి జరిగేదేమీ వుండదు. 

అయితే తిరిగి నటించాలా, లేదా అనే దానిపై అయోమయం మాత్రం అతడిని వీడడం లేదు. రాజకీయాల్లోకి వెళ్లినపుడు ఎలాగైతే రెండు ఆలోచనలు చేసాడో, ఇప్పుడు పునరాగమనంపై కూడా అదే తీరు ప్రదర్శిస్తున్నాడు. ఇది పవన్‌ని మరింత చులకన చేస్తోందే తప్ప అతడి వ్యక్తిత్వాన్ని బలపరచడం లేదు.అందుకే నెమో మొన్న మధ్య సైరా ప్రమోషన్స్ కి వెళ్లుంటాడేమో అని కూడా ప్రత్యర్ధులు గుస గుస లాడుకొంటున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కథను రెడీ చేసే పనిలో పడ్డట్టు ఫిల్మ్ నగర్ టాక్. చూద్దాం మళ్ళీ మేకప్ వేస్తాడో... లేక ప్రజలతో మమేకం అవుతారో...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: