రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె పదకొండోవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మో ఆపమని, మాకు న్యాయం చెయ్యాలని లేకపోతే ఇంకా ఉదృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు అంటుంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం అంటుంది. ఇది మాత్రమే కాకా సమ్మె చేసిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలిగించి కొత్తవారిని నియమిస్తామని తేల్చి చెప్పింది.  


దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి కిరోసిన్ పోసుకొని రెండు రోజులు బాధ అనుభవించి మృతి చెందాడు. అదే రోజున మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. 


ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్న కాస్త కూడా కనికరం లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తాత్కాలిక డ్రైవర్లను నియమిస్తే వారు రోడ్డుపై పోకుండా మనుషులపై బస్సులు నడుపుతున్నారు. మరి కొందరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు.  


అయితే తాజాగా మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించాడు. ఆర్టీసీ హైదరాబాద్‌-2 డిపోకు చెందిన డ్రైవర్‌ రాహుల్‌ అనే వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే దిల్‌సుఖ్‌నగర్‌లో నివసిస్తున్న రాహుల్ సోమవారం ధర్నా చేస్తున్న ప్రదేశంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు అయితే అక్కడే ఉన్న తోటి కార్మికులు అతడిని అడ్డుకున్నారు. 


దీంతో రాహుల్ బాధపడుతూ  'అయ్యా.. నా బతుకుదెరువైన ఆర్టీసీ ఉద్యోగాన్ని సీఎం కేసీఆర్‌ తీసేసిండు. నెలకు వచ్చే రూ.16వేల జీతం వస్తలేదు. ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నా.. నన్ను ఆత్మహత్య చేసుకోనివ్వండి' అంటూ డ్రైవర్ రాహుల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. 


దీంతో అక్కడే ఉన్న మలక్ పెట్ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట సుబ్బారావు రాహుల్‌ లో దైర్యం నింపాడు. ఏదైనా బతికి  సాధించుకోవాలి కానీ పిరికివాడిలా అధైర్య పడకూడదు, సమస్యలు అన్ని రోజులు ఉండవు.. అవి వచ్చినప్పుడు తట్టుకొని నిలబడితేనే ఎదుగుతావు అంటూ డ్రైవర్ రాహుల్ లో దైర్యం నింపి, అఘాయిత్యం చేసుకొని మాట తీసుకొని అక్కడ నుండి వెళ్ళాడు ఇన్‌స్పెక్టర్‌ వెంకట్. 


మరింత సమాచారం తెలుసుకోండి: