ఈ మధ్యనే గ్రామం మరియు పట్టణ సచివాలయా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసిన జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని సచివాలయ పోస్టులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. క్రితం సారి నియామకాలు జరగగా మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 9648 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈసారి పోటీ తీవ్రస్థాయిలో ఉండబోతుంది అన్న విషయం మాత్రం స్పష్టం.

క్రితం సారి వచ్చిన పోస్టుల్లో కొంతమంది నియామక పత్రాలు అందుకోకపోగా మరి కొంతమంది అర్హతలేని వారి పోస్టులు అలాగే ఖాళీగా ఉండిపోయాయి. కాబట్టి ఈ పోస్టులన్నింటికీ మళ్ళీ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోస్టులను జిల్లాల వారీగా విడుదల చేయాలని అధికారులు భావిస్తుండగా అన్నింటికన్నా ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అత్యల్పం శ్రీకాకుళం జిల్లా కాగా అనంతపురం, కర్నూలు, కడప మరియు విజయనగరం జిల్లాల్లో పోస్టులు భారీగానే మిగిలిపోయాయి. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నిరుద్యోగుల సంఖ్య చూస్తే మాత్రం పోటీ క్రితంసారి కన్నా భారీ స్థాయిలో ఉండబోతుంది.

ఇక జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే శ్రీకాకుళం లో 200, విజయనగరంలో 823, విశాఖపట్నంలో 370, పశ్చిమగోదావరిలో 590, తూర్పుగోదావరి లో 1861, కృష్ణ లో 453, గుంటూరు జిల్లా లో 919, ప్రకాశంలో 592, నెల్లూరు 340, చిత్తూరు 678, కడప లో 891, అనంతపురం లో 955, కర్నూలు లో 976 ఇలా మొత్తం 9648 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. పోతే అధికారులు ఇందుకు అవసరమైన అన్నీ కసరత్తులు చేసి ఈ నోటిఫికేషన్ డిసెంబర్ లోగా విడుదల చేయాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: