ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృత్యవాతపడ్డారు.  ఈ దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమా అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. మంగళవారం  మధ్యాహ్నం టూరిస్టు బస్సు లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మారేడుమల్లి-చింతూర్‌ ఘాట్‌ రోడ్డులో ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా  చోటుచేసుకుందిన్న అంశంపైనా విచారణ కొనసాగుతుంది.



జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నఘటన ఫై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పర్యటక బస్సు లోయలో పడి 10 మంది మృతి చెందారు. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్‌ వాల్మీకి కొండ వద్ద ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలు కాగా...కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. పర్యటకులంతా కర్ణాటక చిత్రదుర్గ నుంచి వచ్చిన వారే భద్రాచలంలో దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 12  మంది యాత్రికులు ఉన్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు.



రవాణాశాఖలో ఎట్టి పరిస్ధితుల్లో అవినీతిని సహించేది లేదు. ఏ స్ధాయి అధికారి తప్పు చేసినా క్షమించేది లేదని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.  రవాణాశాఖలోని అన్ని స్ధాయిల్లోనూ పూర్తిగా పారదర్శకంగా సేవలను  అందించాలన్నారు. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో రవాణాశాఖ అధికారుల నిర్వాకం తన దృష్టికి వచ్చిందన్నారు. రవాణాశాఖలో ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి నాని చెప్పారు. ఆరోపణలు వచ్చిన పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లా అధికారులపై విచారణ చేసి, క్రమశిక్షణ చర్యలకు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను మంత్రి పేర్ని ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: