జగన్ పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సర్కార్‌ చేపట్టని కార్యక్రమాన్ని టేకప్‌ చేయాలని డిసైడయ్యారు. మార్కెటింగ్ రంగంలోకి నేరుగా ప్రవేశించేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఓ వైపు రైతులకు.. మరోవైపు వినియోగదారులకు మేలు చేకూర్చేలా మార్కెటింగ్ రంగంలోకి ప్రభుత్వం ఎంటర్ కావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది.


రైతులను ఏళ్ల నుంచి పట్టిపీడిస్తున్న సమస్య గిట్టుబాటు ధర. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ప్రతీ సీజన్‌లో ఇదే సమస్య. ఆరుగాలం కష్టపడి పంటపండిస్తే... చివరికీ గిట్టుబాటు ధరలేక నిండా మునుగుతున్నారు. దీంతో వీటన్నింటికీ త్వరలోనే చెక్ పెట్టాలని డిసైడయ్యింది ఏపీ ప్రభుత్వం. మార్కెటింగ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా మార్కెటింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వమే నేరుగా మార్కెటింగ్ రంగంలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది.


ప్రస్తుతం ఉల్లి, టమోట ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరలను నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటోంది. నేరుగా మార్కెటింగ్ చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల మార్కెటింగ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో జగన్ కొన్ని కీలక సూచనలు చేసినట్టు సమాచారం. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేయడంతో రైతులను ఆదుకున్నట్లు అవుతుందని ప్రభుత్వం ఆలోచన. అంతేకాదు వాటిని మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా ఉల్లి, టమోట లాంటి పంటలకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వమే స్వయంగా నెలకొల్పాలని భావిస్తోంది. ఇలా ప్రాసెస్ చేసిన టమాట సాస్.. పల్ప్ వంటి వాటిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టళ్లు.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చనేది ప్రభుత్వ వ్యూహం. ఈ ప్రాసెసింగ్ ఉత్పత్తులను బహిరంగ మార్కెటింగ్ చేసుకోగలిగితే ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. 


నిజంగా దీన్ని అమలు చేస్తే.. రైతులకు భరోసా కల్పించినట్లే. ఇప్పటికే రైతు పక్షపాతి అనే ముద్రవేసుకుంటున్న జగన్‌ సర్కార్‌... మార్కెటింగ్‌ రంగంలో చేస్తున్న సంస్కరణలతో వినియోగదారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పక్కా ప్రణాళికను సిద్దం చేసి ఓ చక్కటి వ్యవస్థను సెట్ చేసిస్తే.. కచ్చితంగా అద్బుతమైన ఫలితాలు వస్తాయనేది ప్రభుత్వ పెద్దల భావన. దీని కోసం ఐఐటీ, ఐఐఎంలను రిక్రూట్ చేసుకుని వారి సహకారంతో ప్రభుత్వమే మార్కెటింగ్ చేసే అంశంపై రోడ్ మ్యాప్ సిద్దం చేస్తే.. జగన్‌ ముద్ర బలంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: