ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చంద్రబాబును యూటర్న్ నాయకుడు అంటూ ఎగతాళి చేస్తూనే ఉన్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తీసుకున్న యూటర్న్ లను ఉద్దేశించి వారు ఇదివరకే వ్యాఖ్యనాలు చేశారు. చంద్రబాబు యూటర్న్ లకు  ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు,అదే కారణం చేత ఆయనను ఈ ఎన్నికలలో దించేశారు  అని తెలిపారు. చివరికి కుప్పంలో కూడా చంద్రబాబుకి  మెజారిటీ చాలావరకూ తగ్గింది అని, కేవలం ఆయన యూటర్న్ ల పట్ల ప్రజలకు ఏ రేంజ్లో విరక్తి వచ్చిందో  దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు పేర్కొన్నారు. విశేషం ఏమిటంటే ఇప్పటికి ఆయన యూటర్న్ లు మాత్రం ఆగటం లేదు.

బీజేపీతో కలిసి ఉన్నంత సేపు  రాష్ట్ర ప్రయోజనాల విషయంలో  చంద్రబాబు నాయుడు ఒకరకంగా మాట్లాడి ,అంతకు ఎన్నికల  ముందు మాట్లాడిన రీతికి పూర్తి భిన్నంగా  మాట్లాడారు అని చెప్తున్నారు. ఇక బీజేపీతో పూర్తి తెగదెంపులు చేసుకున్నాకా చంద్రబాబు తీరు మారిపోయిందని,కమలం పార్టీపై దుమ్మెత్తి  పోసి,మోడీని కూడా అనరాని మాటలన్నారు.బహుశా మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినట్టుగా పాకిస్తాన్ వాళ్లు కూడా తిట్టి ఉండరేమో. ఇప్పుడు  మోడీని మళ్లీ మాయచేయటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను మొదలు పెట్టారని తెలుస్తుంది.

మోడీతో విబేధించడం తప్పైపోయిందని చంద్రబాబు నాయుడు ఓపెన్ గా మీడియా ముందు  చెప్పుకొచ్చారు.ఇలా బీజేపీ నేతలను తిరిగి  మంచిక  చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని స్పష్టం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడి కలల పంట అయిన  పట్టిసీమతో పాటు పలు ఎత్తిపోతల పథకాలు , నదుల అనుసంధానం, కొండవీటి ప్రాజెక్టు అని ఇలా చంద్రబాబు నాయుడు అన్ని ప్రాజెక్టులనూ వాళ్లకే అప్పచెప్పారు . ఇదివరకు  చంద్రబాబు నాయుడే  మెగాకు దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువ అయిన పనులను అప్పగించారు.

ఇప్పుడే అదే మెగా కృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు దూషిస్తూ  ఉన్నారు. అప్పుడేమో ఆయనకే  పనులు అప్పగించి మరి సన్మానాలు చేసారు.చివరికి  పారిశ్రామిక వేత్తలతో  వ్యవహరించే తీరులో కూడా చంద్రబాబు నాయుడు తన ద్వంద్వ వైఖరితో,తన మార్కు యూటర్న్ లు తీసుకుంటూ ఉన్నారని స్పష్టం అవుతూ వస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు ఎలా అంటే అలా ఆయన అనుచరులు,మీడియా వర్గాలు సై అంటాయి.అయితే చంద్రబాబు నాయుడు ఇలాంటి టర్న్ కు అయినా కట్టుబడతారని చెప్పటానికి  లేదు. ఈరోజు ఇలా మాట్లాడిన ఆయనే,రేపు మళ్లీ మరో టర్న్ తీసుకుని మరో మాటతో వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: