ఏపీలో ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న జగన్... రైతులకు తన తండ్రి వైఎస్ బాటలోనే పెద్ద పీట వేస్తున్నారు.తాజాగా రైతు భరోసా పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని 12వేల 500 నుంచి 13వేల 5వందలకు పెంచిన జగన్... రైతులకు సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇస్తున్న పరిహారం విషయంలో కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆత్మహత్య పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. ఏడు లక్షలకు పెంచుతూ జీవో విడుదల చేసింది జగన్ సర్కార్. రైతు కుటుంబాల కోసం జగన్ చేస్తున్న కృషిపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


 రైతులకు తన తండ్రి వైఎస్ బాటలోనే పెద్ద పీట వేస్తున్నారు.తాజాగా రైతు భరోసా పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచిన జగన్... రైతులకు సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇస్తున్న పరిహారం విషయంలో కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆత్మహత్య పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. ఏడు లక్షలకు పెంచుతూ జీవో విడుదల చేసింది జగన్ సర్కార్.


మరోవైపు నేటి నుంచీ రైతు భరోసా పథకం అమల్లోకి రానుంది. నెల్లూరు జిల్లా... కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు ఇవ్వడంతో పాటూ... రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇవ్వనున్నారు. ఈ రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: