కుక్కలంటే చాలామంది ప్రాణం ఇస్తారు. పెంపుడు కుక్కని కూడా ఇంట్లో ఒక వ్యక్తిగా చూసుకుంటారు చాలామంది. కొంతమందికి కుక్కలపై ప్రేమ చెప్పలేనంత ఉంటుంది. వారి ప్రేమను చూస్తే బాబోయ్ అని అన్నిస్తుంది ఒకోసారి. ఈ తరహాలోనే ఓ మహిళా తన ముద్దుల కుక్కకు పుట్టిన బిడ్డలకు బారసాల చేసింది.  


మాములుగా ఇంట్లో బిడ్డ పుడితే తొలిసారి జరిపే వేడుక బారసాల. బిడ్డ పుట్టిన 21వ రోజున స్నేహితులను, కావాల్సిన వారిని, బంధువులను పిలిచి పుట్టిన బిడ్డకు బారసాల నిర్వహిస్తారు. ఉయ్యాలలో వేసి, పేరు పెట్టి పెద్దల దీవెనలు అందిస్తారు. ఇది హిందూ సంప్రదాయం. అయితే ఇదే బారసాల వేడుకని ఓ పెద్ద ఆవిడా తన పెంపుడు కుక్కకు పుట్టిన కుక్క పిల్లలకు బారసాల చేసింది.  


ఈ బారసాల కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలలో జరిగింది. గన్నేరువరంకు చెందిన ఇక్కర్తి విజయలక్ష్మి అనే ఒంటరి మహిళ తన పెంపుడు కుక్క పిల్లలకు బారసాల నిర్వహించి తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమను చాటుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే గన్నేరువరం  విజయలక్ష్మి గ్రామంలో బంధువులు లేక, కట్టుకున్న భర్త వదిలేసి, పిల్లలు లేక ఒంటరిగా జీవనం సాగిస్తుంది, ప్రేమతో ఒక కుక్కను పెంచుకుంది. 


అయితే ఆ కుక్క దసరా రోజున అయిదు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దింతో విజయలక్ష్మి సంతోషంతో కుక్క పిల్లలకు బారసాల నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలను అతిథులుగా పిలిచి తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో కుక్క పిల్లలకు బట్టలుపెట్టి గ్రామస్తులకు విందు భోజనం ఏర్పాటు చేసింది. ఈ న్యూస్ కొంచం వింతగా ఉన్న ఓ మూడు నెలల క్రితం ఇలాంటి ఘటనే ఇదే తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ముగా జీవాలను ఎంత ప్రేమిస్తున్నారు అనేది. రాయితీ ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: