నాటు వైద్యం వల్ల జరిగే అనర్ధాలు రోజు టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కీళ్ల నొప్పులు పోతాయని, శరీరంలో ఎలాంటి సమస్య ఉన్న ఈ నాటు వైద్యంతో పోతుందని ఎందరో ఎదురు దెబ్బలు తిని మళ్ళి ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్నారు. ఈ ఘటనలు అన్ని చూసినప్పటికీ బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తానంటూ ఓ నాటు వైద్యుడు ఇచ్చిన ప్రకటన యూట్యూబ్ లో చూసి విజయవాడకు వెళ్లి బాలుడ్ని పోగొట్టుకుంది ఆ మహిళా. 

               

ఇంకా విషయానికి వస్తే విజయవాడలో నాటు వైద్యం పేరుతో దారుణం చోటుచేసుకుంది. నాటు వైద్యం వికటించి కడప జిల్లాకు చెందిన చిన్న పిల్లాడు మృతి చెందాడు. అదే నాటు వైద్యంతో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో పిల్లల్ని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

                

పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఓ నాటు వైద్యుడు బుద్ధిమాంద్యానికి చికిత్స చేస్తానంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి బెంగళూరు, బళ్లారి, కడపతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 11 మంది బాధితులు చికిత్స నిమిత్తం విజయవాడ వచ్చారు. 

              

కాగా నాటు వైద్యుడు భూమేశ్వర రావు గవర్నర్‌ పేటలోని గంగోత్రి లాడ్జిలో 3 గదులు అద్దెకు తీసుకుని గత నాలుగు రోజులుగా ఆ పదకొండు మంది బాధితులకు చికిత్స అందిస్తున్నాడు. అయితే ఈ నాటు వైద్యం వికటించి హరనాథ్‌ అనే బాలుడు మృతి చెందాడు. దీంతో విషయం వెలుగు చూసింది. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరి నాటు వైద్యుడు భూమేశ్వరరావును అరెస్ట్ చేశారు.  

                

మరింత సమాచారం తెలుసుకోండి: