సుజానాచౌదరి అంటే ఇప్పటికీ మీడియాకు కొంత అయోమయమే. ఆయన పేరు రాయాలంటే  అలవాటులో పొరపాటుగా టీడీపీ నేత అని రాసేస్తారు. అంతటి అనుబంధం ఆయనకు టీడీపీతో. అటువంటి సుజనా కాషాయం రంగు మార్చుకున్నరంటే బహుశా ఆయనకు కూడా నమ్మకం కలగదేమో. కానీ రాజకీయ అనివార్యత అలా చేయిస్తుంది. అందుకే సుజనా తాను బీజేపీలో ఉన్నా కూడా టీడీపీ గొంతు మరచిపోలేకపోతున్నారు.


అప్పటికీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు చెబుతూ వస్తున్నారు. బీజేపీలో ఎవరు చేరినా ఆ పార్టీ స్టాండ్ నే వినిపించాలని. కానీ సుజనా మాత్రం తన పాత ధోరణి వీడడం లేదు. అందువల్లనే ఆయన చంద్రబాబుని వెనకేసుకువస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసినట్లుగా చెబుతున్నారు. 


చంద్రబాబుకు అంతలా బీజేపీతో దోస్తీ కట్టాలని ఉంటే తాను ప్రయత్నం చేస్తానని సుజనా అంటున్నారుట. మరి ఇదంతా బాబు భక్తి పేరు మీద శిష్యుడు అంటున్న మాటగా చెప్పుకోవాలి. చంద్రబాబుని బీజేపీ వీడిపోవద్దని తాను చెప్పిచూశానని కూడా సుజనా అంటున్నారు. మళ్లీ దోస్తీ కట్టేలా చూస్తానని సుజన అంటున్నారంటే బీజేపీతో బాబు గారి పొత్తులకు సూత్రధారి కావడం కోసమే సుజన కమలం గడప తొక్కారని ఇపుడు అర్ధమవుతోందని అంటున్నారు.


ఎంతైనా బాబు తెలివైన వారే మరి. తన మాట బీజేపీలో వినిపించేలా దగ్గరుండి మరీ సుజనాను పంపించారని వైసీపీ నేతలు అంటున్న మాటలు ఇపుడు నిజమేననిపిస్తున్నాయి. ఇక సుజనా ఇంతదాకా వచ్చాక బాబు గారి కోసం గట్టిగా బీజేపీలో పోరాడకుండా ఉంటారా, బంధం కలపకుండా ఉంటారా, మొత్తానికి సుజనా కాషాయ‌ రాజకీయం బీజేపీకి ఏమో కానీ టీడీపీకి బాగా ఉపయోగపడుతున్నట్లుగా ఉంది.  ముందు ముందు ఏ రాజకీయ పరిణామలు సంభవిస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: